యూత్ కు ఐకాన్ హీరోగా ఎదిగిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం సినిమాకు 10 కోట్ల పారితోషికం తీసుకుంటున్నాడు. దీనికితోడు విజయ్ ఎప్పుడు సోషల్ మీడియాలో చాల యాక్టివ్ గా ఉంటాడు. ఈ విషయాలకు మించి విజయ్ కు ఉన్న తెలంగాణ మూలాలతో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఒక ప్రముఖ అధినాయకుడు తో విజయ్ కు చాల మంచి సాన్నిహిత్యం ఉంది. 


ఇలాంటి పరిస్థితులలో ప్రస్తుతం ఇండస్త్రీలోని చిన్న హీరోల దగ్గర నుండి పెద్ద హీరోల వరకు కరోనా సమస్య పై స్పందిస్తూ వీడియోలు విడుదల చేస్తున్నారు. అంతేకాదు తమతమ స్థాయిలలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి కొత్తగా ఏర్పడ్డ ‘సిసిసి’ కి భారీ విరాళాలు ఇస్తూ ఉంటే ఈ విషయాల పై కనీస స్పందన కూడ విజయ్ వైపు నుంచి లేకపోవడం ఇండస్ట్రీని ఆశ్చర్య పరుస్తోంది. 


ప్రస్తుతం విజయ్ లాక్ డౌన్ పరిస్థితులలో తన ఇంటికే పరిమితం అయిపోయినా కనీసం చిరంజీవి ప్రయత్నాలకు సంఘీభావం తెలుపుతూ ఒక ట్విట్ కూడ చేయకపోవడం చాలామందికి షాకింగ్ న్యూస్ గా మారింది. వాస్తవానికి విజయ్ దేవరకొండకు మెగా కాంపౌండ్ కి మంచి సాన్నిహిత్యం ఉంది. అయినా విజయ్ తన మౌనాన్ని కొనసాగిస్తున్నాడు. 


తెలుస్తున్న సమాచారం మేరకు విజయ్కరోనా సహాయ కార్యక్రమాలలో తనదైన మార్క్ కనిపిచే విధంగా ఒక భారీ కార్యక్రమానికి డిజైన్ చేసే పనిలో తన పిఆర్ టీమ్ తో చర్చలు జరుపుతూ కొత్త ఆలోచనలలో ఉన్నట్లు టాక్. ఒకటి రెండు రోజులలో విజయ్ సహాయ కార్యక్రమాలకు సంబంధించి ఒక క్లారిటీ రావడమే కాకుండా విజయ్ సొంతంగా ఒక ఎన్జీవో ను ఏర్పాటు చేసే పనిలో కూడ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇండస్ట్రీలో అందరితోను కలిసి నడవవలసిన పరిస్థితులలో ఇలా వేరు కుంపటి పెట్టడం విజయ్ కెరియర్ కు అంత మంచిది కాదు అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: