ఛలో సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన్న ప్రస్తుతం తెలుగులో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది. హిట్ల మీద హియ్లు వరుసగా పడుతున్న కొద్దీ ఆమె స్థాయి మరింత పెరుగుతుంది. ఈ సంక్రాంతికి వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో సూపర్ స్టార్ సరసన నటించి మంచి హిట్ అందుకుంది. ఆ హిట్ వచ్చిన నెలలోపే మరో హిట్ భీష్మ రూపంలో ఆమెని పలకరించింది.

 


ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరో పక్కన నటించడానికి ఉన్న ఏకైక హీరోయిన్ గా మారిన తరుణంలో అమ్మడు తన పారితోషికాన్ని బాగా పెంచేసిందట. వరుస విజయాలు పడుతుండటంలో లక్కీ గర్ల్ గా మారి నిర్మాతలకి సెంటిమెంట్ గానూ మారింది. అయితే ఇదే అదునుగా ఆమె భారీగా డిమాండ్ చేస్తుందట. అంతే కాదు చిన్న హీరోల సినిమాల్లో నటించడానికి ఇష్టపడటం లేదని టాక్. మీడీయం రేంజ్ ఉన్న హీరోలతో చేసే కథల్ని తన వద్దకు తీసుకురావద్దంటూ చెప్పిందట.

 

దీంతో ఆమె స్టార్ హీరోలతో మాత్రమే చేస్తుందని ఫిలిమ్ నగర్ సర్కిల్స్ కోడై కూస్తున్నాయి. అయితే స్టార్ డమ్ అనేది కొన్ని రోజులే ఉంటుందని ప్రతీ ఒక్కరికీ తెలుసు. ఏదైనా కొద్దిరోజులే ఉంటుంది. ఇప్పుడు రష్మిక స్టార్ హీరోయిన్ గా ఉంటే, మరికొన్ని రోజుల్లో ఆ స్థానాన్ని వేరే వారు భర్తీ చేస్తారు. ఆ విషయం చాలా మంది హీరోయిన్లలో నిజమైంది. హీరోయిన్ల కెరీర్ చాలా కొద్ది కాలమే ఉంటుంది.

 

 

ఎప్పుడూ కొత్తవారు వస్తున్న ఈ ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరు స్టార్ హీరో అవుతారనేది చెప్పలేం. అలాంటి సిట్యుయేషన్ లో రష్మిక మందన్న చిన్న హీరోలతో సినిమాలు చేయనని చెప్పడం ఎంతవరకు కరెక్టో ఆమెకే తెలియాలి. అయితే స్టార్ హీరోయిన్ గా పారితోషికం ఎక్కువ డిమాండ్ చేయడంలో అర్థం ఉంటుంది కానీ చిన్న హీరోల సినిమాల్లో నటించనని చెప్పడం కరెక్ట్ కాదని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: