కరోనా ప్రధానమంత్రుల దగ్గర నుండి సామాన్యుల వరకు వారి జీవితాలతో ఒక ఆట ఆడుకుంటున్న పరిస్థితులలో కరోనా పేరు చెపితే ప్రస్తుతం అందరు హడలిపోతున్నారు. ఇలాంటి పరిస్థితులలో ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ ఫ్యామిలీకి చెందిన ఒక హీరో ఫ్యామిలీకి  కరోనా వచ్చింది అంటూ బాలీవుడ్ మీడియా వార్తలు క్రియేట్ చేయడంతో రాజమౌళి యూనిట్ టెన్షన్ పడినట్లు వార్తలు వచ్చాయి. 

 


బాలీవుడ్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీలో కీలక పాత్రలో నటిస్తున్న అజయ్ దేవగన్ భార్య కాజోల్ కు వారి కూతురు న్యాస కు కరోనా వ్యాధి టెస్ట్ లో పాజిటివ్ రిజల్ట్ వచ్చింది అంటూ వచ్చిన వార్తలు కలకలం సృష్టించాయి. అంతేకాదు కరోనా టెస్ట్ అజయ్ దేవగన్ కు కూడ చేయబోతున్నట్లు బాలీవుడ్ మీడియా వార్తలు రాయడంతో ఈ విషయం రాజమౌళి దృష్టి వరకు వెళ్ళడంతో అతడు కూడ షాక్ అయినట్లు టాక్.


అయితే జరుగుతున్న పరిణామాలు అజయ్ దేవగన్ దృష్టి వరకు రావడంతో అతడు నష్ట నివారణ చర్యలు మొదలు పెట్టి తన భార్య కాజోల్ కు కాని లేకుంటే తన కూతురుకు కాని ఆఖరకు తనకు కాని కరోనా లక్షణాలు లేవని కేవలం తాము అంతా స్వీయ గృహ నిర్భందంలో ఉండటంతో ఈ వార్తలు అన్నీ మీడియా సృష్టించిన పుకార్లు అంటూ కొట్టిపారేయడం జరిగింది. దీనితో రాజమౌళి తెరిపిన పడినట్లు టాక్. 


‘ఆర్ ఆర్ ఆర్’ మూవీలో అజయ్ దేవగన్ కీలక పాత్రను నటించడమే కాకుండా ఈమధ్య లేటెస్ట్ గా జరిగిన ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ లో కూడ అజయ్ దేవగన్ పాల్గొన్నాడు. ఈ షూటింగ్ సమయంలో అజయ్ దేవగన్ ప్రదర్శించిన నిరాడంబరత గురించి రాజమౌళి ప్రశంసిస్తూ ఇప్పటికే అజయ్ గొప్పతనం పై బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కామెంట్స్ కూడ చేసాడు. ఏది ఏమైనా అనేక సమస్యల మధ్య సతమతమైపోతున్న రాజమౌళికి అజయ్ దేవగన్ కుటుంబ ఆరోగ్యానికి సంబంధించి వచ్చిన వార్తలు ఒక విధంగా టెన్షన్ కలిగించి ఉంటాయి అనడంలో ఎటువంటి

సందేహం లేదు..   

 

మరింత సమాచారం తెలుసుకోండి: