తెలుగు చిత్ర సీమ‌లో కాస్త భిన్నంగా హీరోల్లో నారా రోహిత్ కూడా ఒక‌రు. ఆయ‌న హీరోగా న‌టించిన సినిమాలు త‌క్కువే అయినా దేనిక‌దే ప్ర‌త్యేక‌మ‌ని చెప్పాలి. మొద‌టి సినిమా బాణం మొదలు క‌థాబ‌లం ఉన్న సినిమాల్లో న‌టిస్తూ వస్తున్నారు. అయితే పెద్ద బ్లాక్ బ‌స్ట‌ర్లు లేకపోయినా మంచి న‌టుడిగా మాత్రం గుర్తింపు ద‌క్కింది. నారా రోహిత్‌....నారా చంద్ర‌బాబునాయుడు త‌మ్ముడైన రామ్మూర్తినాయుడి కుమారుడు. ఫ్లాష్ బ్యాక్‌కు వెళ్తే... చిత్తూరు జిల్లా చంద్ర‌గిరి ఎమ్మెల్యే టికెట్‌ను అన్న చంద్ర‌బాబును కాద‌ని, ఎన్టీఆర్ ఆశీస్సుల‌తో రామ్మూర్తినాయుడు అప్ప‌ట్లో తెచ్చుకున్నాడు. త‌న ప్ర‌త్య‌ర్థి గ‌ల్లా అరుణ‌కుమారిపై గెలుపొంది ఎన్టీఆర్ న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టాడు. 

 

అయితే నాటి నుంచి చంద్ర‌బాబు ఎదుట రామ్మూర్తి పేరు ఎత్తితే చాలు భ‌గ్గుమంటాడు. అయితే ఎన్టీఆర్ మ‌ర‌ణానంత‌రం త‌న‌ను కాద‌న్న త‌మ్ముడి ని రాజ‌కీయంగా బాగా అణ‌గ‌దొక్కేశాడ‌న్న అభిప్రాయం రాజ‌కీయ వ‌ర్గాల్లో ఉంది.  చంద్ర‌బాబు టీడీపీలో రామ్మూర్తిని ఎద‌గ‌నీయ‌కుండా చేశాడ‌నే నిష్టూర స‌త్య‌మ‌ని ఆయ‌న స‌న్నిహితులు ఇప్ప‌టికి చెబుతుంటారు. ఈ ప‌రిస్థితుల్లోనే ఆయ‌న త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో అప్ప‌ట్లో సోనియా స‌మ‌క్షంలో వైఎస్సార్ నేతృత్వంలో కాంగ్రెస్‌లో చేరాడ‌ని పేర్కొంటారు. అయితే రామ్మూర్తి ఊహించిన‌ట్టుగా చంద్ర‌గిరి టికెట్‌ను కాంగ్రెస్ అధిష్టానం ఇవ్వ‌క‌పోవ‌డం, 2004లో టీడీపీ ఓట‌మిపాలు కావ‌డంతో రాంమ్మూర్తిని  టీడీపీలో చేరిపోయారు. నాటి నుంచి టీడీపీలోనే కొన‌సాగుతూ వ‌స్తున్నారు.  

 

అయితే చాలా రోజులుగా ఆయ‌న‌ అల్జీమ‌ర్స్తో బాధ‌ప‌డుతున్నారు. రామ్మూర్తినాయుడు మ‌నుషుల‌ను గుర్తు ప‌ట్ట‌లేని ప‌రిస్థితిలో ఉండ‌టం బాధాక‌రం. ఆయ‌న ఇంటి నుంచి బ‌య‌ట‌కు క‌ద‌ల్లేని ప‌రిస్థితి. కుటుంబం చాలా క్లిష్ట ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటున్న స‌మ‌యంలో కూడా  నారా రోహిత్ రూ.30 ల‌క్ష‌ల విరాళాన్ని ప్ర‌క‌టించి నిజ‌మైన హీరో అనిపించుకున్నాడంటూ తెలుగు చిత్ర‌సీమ‌లోని ప‌లువురు ప్ర‌ముఖులు ఆకాశానికెత్తుతున్నారు. ఈ మొత్తంలో ఏపీ, తెలంగాణ  ప్రభుత్వాల సీఎం సహాయ నిధుల‌కు చెరో రూ.10 లక్షలు, ప్రధాన మంత్రి సహాయ నిధికి మరో రూ.10 లక్షలు విరాళంగా ఇస్తున్న‌ట్లు తెలిపాడు. అందరం సమష్టిగా పోరాడి కరోనా మహమ్మారిని తరిమి కొడదాం అని ఆయ‌న పిలుపునివ్వ‌డం గ‌మ‌నార్హం. ఇదిలా ఉండ‌గా రూ.10ల‌క్ష‌లు ఆర్థిక సాయంగా ప్ర‌కటించిన చంద్ర‌బాబును ఉద్దేశించి నారా రోహిత్‌కు మ‌ద్ద‌తుగా పోస్టులు పెడుతుండ‌టం గ‌మ‌నార్హం.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: