బాలక్రిష్ణ అనగానే వెనకాల ఎన్టీయార్ తప్పకుండా రీసౌండ్ ఇస్తారు. నందమూరి వంశాంకురం బాలయ్య. తొలితరం నట వారసుడు. తండ్రి లెగసీని సినిమా ఫీల్డ్ లో గత నాలుగు దశాబ్దాలుగా నిలబెడుతూ వస్తున్నాడు. ఇపుడున్న సీనియర్ హీరోలందరి కన్నా సీనియర్ నటుడు. అన్ని రకాలైన పాత్రలు వేసి మరీ  మేటి అనిపించుకున్న వాడు. ఎంతో చరిత్ర ఉన్న వంశానికి చెందిన బాలయ్య ఇపుడు టాలీవుడ్లో ఎలా అయిపోయారో అన్న చర్చ  నడుస్తోంది.

 

బాలయ్యని మిగిలిన హీరోలు పూర్తిగా పక్కన పెట్టారా లేక ఆయనే కావాలని సైడ్ అయ్యారో తెలియదు కానీ బాలయ్య బాగా ఒంటరి అయ్యాడనే చెప్పాలి. టాలీవుడ్ ఇపుడు టోటల్ గా  చిరంజీవి చుట్టూ తిరుగుతోంది. మిగిలిన హీరోలంతా కూడా ఆయన్ని పెద్దాయన్ని చేశారు. దాసరి నారాయణరావు తరువాత స్థానం చిరంజీవికి కట్టబెట్టారు.

 


నాగార్జున, మోహన్ బాబు, వెంకటేష్ వంటి సీనియర్లతో పాటు, ప్రభాస్,  మహేష్ బాబు, జూనియర్ ఎన్టీయార్ వంటి యంగ్ స్టార్స్ కూడా చిరంజీవికి సపోర్ట్ గా  ఉంటున్నారు. ఇక చిరంజీవి కుటుంబంలో కూడా పెద్ద ఎత్తున యంగర్ జనరేషన్ ఉన్నారు. వారంతా సహజంగా చిరంజీవి పక్షమే ఉంటారు. మొత్తానికి టాలీవుడ్ కి పెద్ద చిరంజీవిగా కనిపిస్తున్నారు.

 

మరి బాలయ్యతో కూడా చిరంజీవికి మంచి స్నేహం ఉంది. అయినా ఆయన ఎక్కడా చిరంజీవితో రాసుకుపూసుకుని కనిపించరు. ఈ మధ్యన 80 దశకం హీరోలతో చిరంజీవి తన ఇంట్లో పార్టీ ఇస్తే దానికి బాలయ్య అటెండ్ కాలేదు. ఇక టాలీవుడ్లో మొత్తం అంతా ఒక వైపు ఉంటే బాలయ్య మాత్రం ఒక్కరే కనిపిస్తున్నారు.

 

ఈ పరిణామాలకు తోడు ఆయన్ని వరస ఫ్లాప్స్ ఇబ్బంది పెడుతున్నాయి. దాంతోనే ఆయన గమ్మున  ఉండిపోయారని అంటున్నారు. కరోనా విషయంలో మిగిలిన హీరోల కన్నా బాలయ్యకు ఇంకా ఎక్కువ పాత్ర ఉంది. ఆయన బాధ్యత కలిగిన ప్రజా ప్రతినిధి,  రెండు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ ఆయన తన సందేశాన్ని ఎక్కడా వినిపించలేదు. ఎందుకో బాలయ్య సైలెంట్ అయ్యారు. ఆయన అలా ఉన్నారా, చేశారా అన్నది టాలీవుడ్లో పాలిటిక్స్ ని  అడిగితే తెలుస్తుందేమో.

 

మరింత సమాచారం తెలుసుకోండి: