ఈ మ‌ధ్య కొన్ని సినిమా గాసిప్స్‌కి అర్ధ ప‌ర్ధం లేకుండా పోతున్నాయి. స‌మాచారం సూటిగా ఇవ్వ‌కుండా అటూ ఇటూ ఎలా ప‌డితే అలా మెలిక‌పెట్టి రాస్తున్నారు. ఇక హెడ్డింగులు కూడా దాదాపు అంతే ఉంటున్నాయి. చ‌దివే రీడ‌ర్స్ కూడా ఏద‌న్నా ఆర్ష‌ణీంగా అనిపిస్తే గాని చ‌ద‌వ‌డం లేదు. ఇక ఇలాంటి గ‌జిబిజి వార్తే ఒక‌టి వెబ్‌సైట్ల‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. అదేమిటంటే...బ్యూటీ ఫుల్ హీరోయిన్ సాయిప‌ల్ల‌వి కులం గురించే ఎవ‌రికి న‌చ్చిన‌ట్లు వారు చ‌ర్చిస్తున్నారు. కొంద‌రు గిరిజ‌న కులం అని మ‌రికొంద‌రు ఇంకోటేదో చెబుతూ ఇలా ఎవ‌రికి న‌చ్చిన‌ట్లు వారు ఏదో రాసేస్తున్నారు. ఇంత‌కీ ఆమెది ఏ కుల‌మ‌యితే మ‌న‌కెందుకు. త‌ను చాలా చ‌క్క‌టి న‌టి. మంచి న‌ట‌న‌తో డ్యాన్స్ తో ప్రేక్ష‌కుల‌ను ఆకట్టుకుంటుంది. అది మన‌కు కావ‌ల‌సింది. ఇక త‌క్కువ కుల‌మ‌యితే ఏంటి ఎక్కువ కుల‌మ‌యితే ఏంటి వాళ్ళ టాలెంట్ ముఖ్యం కాని.

 

తక్కువ కుల‌మ‌యితే వారు స్టార్ స్టేట‌స్‌కి ప‌నికిరారా అలాఏమ‌న్నా రాసి పెట్టారా అదేమి లేదు క‌దా. అయితే అస‌లు ఈ విష‌యం చ‌ర్చ‌కు రావ‌డానికి అస‌లు కార‌ణం ఇటీవ‌లె ఆమె ఒక ఇంట‌ర్వ్యూలో వాళ్ళ భాష‌కు క‌నీసం లిపి కూడా లేద‌ని చెప్పింద‌ట‌. అది ఎందుకు చెప్పిందంటే...ఏదో త‌న బ్యాక్‌గ్రౌండ్ గురించి చెబుతూ అలా తెలిపింది అంతే త‌ప్పించి ప్ర‌త్యేకించి వేరే ఉద్దేశం ఏమీ కాదు. దాన్ని మ‌నవాళ్ళు చిల‌వ‌లు ప‌ల‌వ‌లు చేసి మ‌రీ వార్త‌లు రాస్తున్నారు. అయితే ఇక్క‌డ ఆమె కులం ఏదైతే ఏమిటి నిజానికి అలా ఉన్న ఆడ‌వారు బ‌య‌ట‌కు వ‌చ్చి అంత స్టేట‌స్‌ని సంపాదించారు అంటే వాళ్ళ‌ను మ‌రింత ఎంక‌రేజ్ చేసి ముందుకు న‌డ‌పాలి. ఇక మిగ‌తా హీరోయిన్ల‌తో పోలిస్తే ఆమె చాలా విష‌యాల్లో చాలా బెటర్ అని చెప్పాలి.

 

ఇక ఆమె కులం విష‌యానికి వ‌స్తే...ఆమెది బూడుగ కులం ఇక వారి బాష కూడా బూడుగ భాష అంటారు. ఇక వీరు గిరిజ‌న జాతి కింద వ‌స్తారు. అయితే ఎప్ప‌టినుంచో వారిని ఎస్టీల్లో చేర్చ‌మ‌ని పోరాడుతున్నారు.అయితే వారు చాలా రంగాల్లో రాణిస్తున్నారు. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగ‌నా ర‌నౌత్ చిత్రంలో ఆమె ఫ్రెండ్‌గా న‌టిస్తుంది ధాంధూం అనే చిత్రంతో ఆమె ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మ‌వుతుంది. డ‌బ్బు కోసం బ్రాండ్‌లు, షాప్ ఓపెనింగ్‌లు, బ్రాండ్ ప్ర‌మోష‌న్లు చేయ‌దు. 

మరింత సమాచారం తెలుసుకోండి: