హీరోలకు షాక్ ఏంటి అనుకోవద్దు. తెర మీదే హీరోలు. తెర వెనక వారు కూడా అందరి లాంటి వారే. ఇపుడు కరోనా వైరస్ వచ్చి అందరినీ ఇంట్లో కూర్చోబెట్టిందిగా. పాపం బెడ్ రూం బాత్ రూం అన్నంత ఈజీగా దేశాలకు దేశాలను చుట్టేసే మన హీరోలకు ఎంత కష్టం వచ్చిందో కదా. ఇంటికే పరిమితమై మొక్కలకు నీళ్ళు పోస్తూ జాలిగా  టైం పాస్ చేస్తున్నారు.

 

 

ఇక కరోనా వైరస్ పుణ్యమాని లాక్ డౌన్ మరికొంతకాలం పొడిగించే అవకాశం ఉంది. అంటే వీలైతే ఏప్రిల్ ఎండింగ్, కుదరకపోతే మే అంతా కూడా కంటిన్యూ చేస్తారట. దీన్ని తెలివైన దర్శకుడు పూరీ జగన్నాధ్ ముందే గుర్తించి అందరికీ ప్రిపేర్ అయిపోమన్నారు. కనీసంగా ఎనిమిది వారాలు లాక్ డౌన్ ఉంటుందని కూడా పూరీ అంచనా వేశారు.

 

ఇవన్నీ ఇలా ఉంటే లాక్ డౌన్ వల్ల ఎక్కడికీ కదలలేరు. విమానాలు తిరగవు. పైగా ప్రపంచం అంతా కరోనా దెబ్బకు విలవిలాడుతూంటే ఇంట్లోనే ఉండాలి. ప్రతీ సమ్మర్ కి వెకేషన్  పేరిట చలి దేశాలకు వెళ్ళి హ్యాపీగా గడిపే హీరోలకు ఈసారి సమ్మర్ చాలా కష్టకాలం చూపించేలా ఉంది.

 

నెత్తిన ఎండ చుర్రుమనిపించేలా ఉంది. ఎంత ఏసీలు ఇంట్లో ఉన్నా కూడా ఇండియాలో వేసవి అంటే దాని తడాఖావే వేరు. బయటకు పోదామంటే లాక్ డౌన్, ఇంట్లో ఉంటే సమ్మర్ సఫరింగ్. మన హీరోలకు పెద్ద చిక్కే వచ్చిపడింది. ఒంటిచేత్తో వందలాది మంది హీరోలను చితక్కొట్టేసే హీరోలు ఇపుడు ఏమీ చేయలేక కనపడని శత్రువులతో యుధ్ధం చేస్తూ ఇంట్లోనే గడపడం అంటే పెద్ద ట్రాజడీయే.

 

మొత్తం మీద టాలీవుడ్ హీరోలకు, ఇతర చిత్ర ప్రముఖులకు 2020 సమ్మర్ బాగా గుర్తుండిపోయేలా ఉంది. ఎపుడు లాక్ డౌన్ ఎత్తేస్తారో, మరెపుడు విమానాలు ఎగురుతాయో కానీ అంతవరకూ ఉన్న చోటే ఉండడం అన్న కఠినమైన ఫైటింగ్ చేయాల్సిందే మరి. అయినా వారిని ఆరాధించే కోట్లాది అభిమానుల దీవెనలు ఉండగా వారిని ఈ సమ్మర్ ఏమీ చేయదనే అంతా భావించాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: