టాలీవుడ్ లో  హీరోయిన్ల తెలిసిందే.. రోజుకొక కొత్త హీరోయిన్  పరిశ్రమకు అవుతున్నా సరే స్టార్ ఇమేజ్ తెచ్చుకునే వారు మాత్రం చాలా తక్కువ అని చెప్పొచ్చు. కొంతమంది హీరోయిన్స్ అయితే కేవలం ఒకటి రెండు సినిమాలకే పరిమితం అవుతుండగా కొద్దిగా క్రేజ్ వచ్చిన హీరోయిన్స్ కూడా ఈమధ్య ఫేడ్ అవుట్ అవుతున్నారు. అయితే వీరిలో కొంతమంది అవకాశాల కోసం ఏదైనా చేసేలా ఉన్నారు. కొందరు హీరోయిన్స్ కేవలం అభినయానికి ప్రాధాన్యత ఉన్న పాత్రలు మాత్రమే చేస్తుంటే మరికొందరు మాత్రం గ్లామర్ విషయంలో కూడా రెచ్చిపోతున్నారు. 

 

ఇక స్టార్ హీరోయిన్స్ కేవలం హీరోయిన్స్ మాత్రమే కాదు ఈమధ్య ఐటెం సాంగ్స్ లో కూడా అదరగొడుతున్నారు. అనుష్క, కాజల్, తమన్నా లాంటి హీరోయిన్స్ సైతం స్పెషల్ సాంగ్స్ కు సై అంటున్నారు. ఇక ఇప్పుడు కుమారి హెబ్భా పటేల్ కూడా తాను కూడా స్పెషల్ సాంగ్స్ చేసేందుకు రెడీ అంటుంది. కుమారి 21ఎఫ్ తో యూత్ ఆడియెన్స్ ను మెప్పించిన ఈ అమ్మడు ఆ తర్వాత సినిమాల సెలక్షన్స్ లో పొరపాట్లు చేసింది. అందుకే అమ్మడు కెరియర్ ఆశించిన స్థాయిలో లేదు. ఈమధ్య వచ్చిన భీష్మ సినిమాలో ఒక చిన్న రోల్ అది కూడా వాంప్ గా కనిపించి షాక్ ఇచ్చింది హెబ్భా పటేల్. 

 

అందుకే అలాంటి పాత్రల కన్నా ఐటం సాంగ్స్ బెటర్ అనుకుంది కాబోలు ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో రెడ్ సినిమాలో స్పెషల్ సాంగ్ కు సైన్ చేసింది హెబ్భా పటేల్. మామూలుగానే రెచ్చిపోయే హెబ్భా ఐటం సాంగ్ అంటే ఇక ఆడియెన్స్ కు పిచ్చెక్కించడం ఖాయం. ప్రస్తుతం వెబ్ సీరీస్ లో కూడా నటిస్తున్న ఈ అమ్మడు మళ్ళీ ఫామ్ లోకి రావాలని ప్రయత్నిస్తుంది. మరి ఈ ఐటం సాంగ్ తో అయినా కుమారి కల నెరవేరుతుందేమో చూడాలి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: