సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ఉప్పెన. కరోనా లేకుంటే మరో రెండు రోజుల్లో ఈచిత్రం ప్రేక్షకులముందుకు వచ్చేదే.. అయితే కరోనా వల్ల లాక్ డౌన్ కొనసాగుతున్ననేపథ్యంలో విడుదలను వాయిదావేశారు. మేలో ఈ సినిమా రిలీజ్ కానుందని సమాచారం. ఇక ఈ చిత్రం నుండి తాజాగా  ప్రముఖ తమిళ నటుడు ,మక్కల్ సెల్వన్  విజయ్ సేతుపతి లేటెస్ట్ లుక్  విడుదలైంది. రూరల్ బ్యాక్ డ్రాప్ లో లవ్ స్టోరీ గా  తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ సేతుపతి విలన్ పాత్రలో కనిపించనున్నాడు. కాగా తెలుగులో అతనికి ఇది రెండో సినిమా.. 

 

 
 ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సాన  కొద్ది సేపటి క్రితం  తన ఇంస్టా గ్రామ్ అకౌంట్ ద్వారా విజయ్ సేతుపతి లేటెస్ట్  పోస్టర్ ను విడుదలచేశాడు. ఇంతకుముందు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన బుచ్చి బాబు ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇక ఇప్పటికే విడుదలైన పాటలు సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోవడం తో ఈసినిమా పై మంచి అంచనాలు వున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఆమె కు ఇదే మొదటి సినిమా కాగా రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. సుకుమార్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. మరి ఈ సినిమాతో వైష్ణవ్ తేజ్ హిట్ కొట్టి గ్రాండ్  గా ఎంట్రీ ఇస్తాడో లేదో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: