టాలీవుడ్ సినిమా పరిశ్రమకు అక్కినేని హీరో నాగచైతన్య సరసన ఒక లైలా కోసం సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే, ఆ తరువాత వరుణ్ తేజ్ ఫస్ట్ మూవీ ముకుంద సినిమాలో కూడా నటించింది. అయితే మొదటి సినిమా యావరేజ్ విజయాన్ని అందుకోగా, రెండవ సినిమా ఆమెకు ఫ్లాప్ ని అందించింది. అయితే కమర్షియల్ గా ఆమెకు మంచి పేరు తెచ్చిన మాత్రం ఆ తరువాత బన్నీ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన డీజే సినిమా. 

 

 

మంచి యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఆ సినిమా అప్పట్లో యావరేజ్ విజయాన్ని అందుకున్నప్పటికీ హీరోయిన్ పూజ కి మాత్రం మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తరువాత మరొక్కసారి వరుణ్ తేజ్ హీరోగా తాను తీసిన గద్దలకొండ గణేష్ సినిమాలో కూడా పూజా నే హీరోయిన్ గా తీసుకున్నారు హరీష్. కాగా ఆ సినిమా రిలీజ్ తరువాత సూపర్ హిట్ సొంతం చేసుకోవడం జరిగింది. ఇకపోతే నేడు దర్శకుడు హరీష్ పుట్టినరోజును పురస్కరించుకుని పూజా ఒక ఫన్నీ వీడియో ని తన సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. 

 

 

సెట్లో ఎంతో కామ్ గా ప్రతిదానికి సైలెంట్ గా సిగ్గుపడుతూ ఉండే నాకు ఎంతో ఇష్టమైన దర్శకుడు హరీష్ గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు అంటూ పూజ ఒక వీడియో ని పోస్ట్ చేసింది. అయితే ఆ వీడియో చూసిన హరీష్, నాకు తెలియకుండా ఈ వీడియో ఎప్పుడు తీసావు పూజా అంటూ సరదాగా రిప్లై ఇచ్చారు. గద్దలకొండ గణేష్ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక ఫన్నీ కన్వర్జేషన్ ని వీడియో తీసి పోస్ట్ చేసింది పూజా. కాగా పూజా పోస్ట్ చేసిన ఆ వీడియో ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: