ఇప్పటికే కరోనా మహమ్మారి వలన దేశ దేశాలు అన్ని కూడా పూర్తిగా లాకౌట్ ప్రకటించడం జరిగింది. వ్యాధి తీవ్రతను వేగవంతంగా తగ్గించాలంటే ఇది ఒక్కటే మార్గమని గ్రహించిన మన భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా మన దేశాన్ని 21 రోజులపాటు లాకౌట్ ప్రకటించారు. అయితే దీని వలన ప్రజలు పూర్తిగా ఇళ్లకే అంకితం అవ్వాల్సిందే పరిస్థితి తలెత్తడంతో పేద, దిగువ వర్గాల వారికి పనులు లేక ఇల్లు గడవని పరిస్థితి ఏర్పడింది. అయితే వారి స్థితిని గ్రహించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వారు, వారికి ఉచిత రేషన్, కొంత ఆర్ధిక సాయం వంటివి ప్రకటించడం జరిగింది. 

 

కాగా దానితో పాటు మేము కూడా ప్రజలకు తోడుగా నిలిచి వారి కష్టాలను పాలు పంచుకుంటాం అంటూ మన దేశంలోని అనేక రంగాల వారు ఇప్పటికే తమకు వీలైనంత సాయాన్ని అందించడం జరుగుతోంది. ప్రజలు ఎటువంటి సమస్యల్లో ఉన్నా, తమవంతుగా కొంత మొత్తాన్ని సాయంగా అందించడంలో ఎప్పుడూ ముందుండే తెలుగు సినిమా పరిశ్రమ నుండి అనేక మంది ప్రముఖులు ఇప్పటికే వీలైనంత మొత్తాలను సాయంగా ప్రకటించడం జరిగింది. అయితే ఈ విపత్కర పరిస్థితులతో ఎంతో చలించిపోయిన మెగాస్టార్ చిరంజీవి కరోనా క్రైసిస్ చారిటీ పేరుతో ఒక విపత్తు నిధిని ఏర్పాటు చేయడం జరిగింది. 

 

ఇప్పటికే ఆ చారిటీ కి పలువురు ప్రముఖులు తమకు తోచిన విధంగా సాయం అందించగా, తనవంతు సాయంగా సీనియర్ హీరో శ్రీకాంత్ రూ.5 లక్షల విరాళాన్ని ఈరోజు ప్రకటించారు. శ్రీకాంత్ సహా ఎందరో ప్రముఖులు తన మాటను మన్నించి ప్రజల యొక్క కష్ట పరిస్థితులను అర్ధం చేసుకుని విపత్తు నిధికి విరాళాలు అందిస్తుండడం ఎంతో ఆనందంగా ఉందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ప్రస్తుతం ఇప్పటివరకు ఈ నిధి ద్వారా మొత్తం రూ.6 కోట్లకు పైగా సమకూరిందని, ఇంకా తమకు వీలున్న వారు దయచేసి ముందుకు వచ్చి తమ శక్తికొలది ఎంతో కొంత మొత్తం అందించాలని చిరంజీవి కోరడం జరిగింది.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: