ఒక అబ్బాయికి అమ్మాయికి పెళ్ళి కుదిరిందంటే చాలు. మీరు పెళ్ళి చేసుకుంటున్నఅబ్బాయికి మీకు మ‌ధ్య ఎంత గ్యాప్ ఉంది అని అడ‌గ‌డం అనేది చాలా స‌ర్వ‌సాధార‌ణం. అయితే అందులోనూ పెళ్ళి అన‌గానే మ‌న భార‌త‌దేశ సంస్కృతి సంప్ర‌దాయాల‌ను చూసుకున్నా అమ్మాయి వ‌యసు అబ్బాయి క‌న్నా ఏదో రెండు, మూడు సంవ‌త్స‌రాలు గ్యాప్ ఉండాలి అంటారు. ఈ ఏజ్ గ్యాప్ అనేది ముఖ్యంగా మ‌న సెల‌బ్రెటీల గురించి చెప్పుకుందాం. అయితే ఒక ఆడ, మ‌గ మ‌ధ్య ప్రేమ చిగురించాలిగాని, వ‌య‌సుతో సంబంధం లేదు అంటున్నారు. మ‌రి ఈ రోజుల్లో త‌మ‌కంటే ప‌దిఏళ్ళు తేడా ఉన్న అమ్మాయిల‌ను వివాహం చేసుకున్న సెల‌బ్రెటీల గురించి మ‌నం తెలుసుకుందాం... ఇక ఆ కోవ‌లో ముందుగా మాట్లాడుకోవ‌ల‌సింది జెమిని గ‌ణేష‌న్‌. త‌మిళ్ స్టార్ హీరో ఈయ‌న ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు పెళ్ళిళ్ళు చేసుకున్నారు. 1997లో అంటే నాలుగ‌వ వివాహం చేసుకున్నారు. ఆయ‌న 76వ వ‌య‌సున జూలియా యాండ్రూ అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. ఇక వీరిద్ద‌రూ వివాహం చేసుకున్న స‌మ‌యానికి వారిద్ద‌రికి వ‌య‌సు గ్యాప్ దాదాపు 20 ఏళ్ళు ఉంది. 76ఏళ్ళ వ‌య‌సులో ఈయ‌న‌కు ఆమె మీద ప్రేమ క‌లిగింది. 

 

మ‌రొక హీరో విశ్వ‌విఖ్యాత న‌టుడు ఎన్టీఆర్ ఈయ‌న కూడా 69 ఏళ్ళ వ‌య‌సులో లక్ష్మీ పార్వ‌తిని రెండో పెళ్ళి చేసుకున్నారు. వీరిద్ద‌రి మ‌ధ్య వ‌య‌సు తేడా ఎంతో తెలుసా 31 ఏళ్ళు  ఇక వీరిద్ద‌రికి కూడా ఎలాంటి సంతానం లేదు. ఒక‌ప్ప‌టికి హీరో క‌మెడియ‌న్‌గా మ‌నంద‌ర్నీ అల‌రించిన న‌రేష్‌. క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా ఉన్నాడు. ముఖ్యంగా తండ్రి పాత్ర‌లో బాగా న‌టించి తెగ ఆకట్టుకున్నాడు. న‌రేష్ కూడా మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. ఈయ‌న వివాహం చేసుకున్న భార్య పేరు ర‌మ్య‌కి ఈయ‌న‌కి దాదాపు 10ఏళ్ళ గ్యాప్ వీరిద్ద‌రికి క‌లిపి ముగ్గురు పిల్ల‌లు కూడా ఉన్నారు. అలాగే విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్‌రాజ్ కూడా రెండు పెళ్ళిళ్ళు చేసుకున్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. బాలీవుడ్ కొరియోగ్రాఫ‌ర్ అయిన పూనివ‌ర్మ‌ని రెండో వివాహం చేసుకున్నారు. వీరిద్ద‌రి మ‌ధ్య గ్యాప్ 15 ఏళ్ళు. వీరిద్ద‌రికి ఒక కొడుకు కూడా పుట్టాడు. ప్రేమ అనేది ఏ వ‌య‌సులో ఎవ‌రిపైన చిగురిస్తుందో ఎవ్వ‌రం చెప్ప‌లేం అనే చెప్పాలి. 

 


ఇక బాలీవుడ్ విష‌యానికి వ‌స్తే సైఫ్ అలీఖాన్ క‌రీనా క‌పూర్ వీరిద్ద‌రి మ‌ధ్య గ్యాప్‌ దాదాపు ప‌దేళ్ళ పై మాటే అని చెప్పాలి. సైఫ్ క‌రీనాని రెండో వివాహం చేసుకున్నారు. ఇందులో విచిత్రం ఏమిటంటే క‌రీనా సైఫ్ మొద‌టి పెళ్ళి కి వెళ్ళింద‌ట‌. అప్పుడు త‌ను చాలా చిన్న పిల్ల‌ట‌. అయితే ఆ పెళ్ళిలో సైఫ్‌ని అంకుల్ అంకుల్ అంటూ పిలిచి తెగ అల్ల‌రి చేసింద‌ట‌. మ‌రి ఇప్పుడు అంకుల్‌నే పెళ్ళి చేసుకుంది. బాలీవుడ్ హీరో షాహిద్ క‌పూర్ కూడా వీరారాజ్‌ని ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. ఇక వీరిద్ద‌రికి 12ఏళ్ళు తేడా ఉంది. లేటు వ‌య‌సులో పెళ్ళి చేసుకుని ఎంజాయ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: