నిజంగా ఈ కరోనా వైరస్ వ్యాప్తి చాలా భయంకరంగా ఉంది. రోజు రోజుకు ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఎక్కువ అయిపోతున్నాయి. ఇంకా ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఈ కరోనా వైరస్ కేసులు ప్రపంచవ్యాప్తంగా 8 లక్షల పాజిటివ్ కి చేరాయి. 38 వేలమందికిపైగా ఈ కరోనా వైరస్ వైరస్ బారిన పడి మృతి చెందారు. 

 

ఇంకా అలాంటి ఈ కరోనా వైరస్ సామాన్యుల నుండి ప్రధానమంత్రుల వరుకు ఎవరిని వదలడం లేదు. ఆమ్లా ఈ నేపథ్యంలోనే ఈ కరోనా వైరస్ ఇప్పటికే ఓ ఇండియన్ సింగర్ ని పట్టి పీడించగా.. ఇప్పుడు అమెరికాలోను ఓ సింగర్ కు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అమెరికన్ సింగర్ కలీ షోర్‌కు కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. 

 

దీంతో అభిమానులు అంత ఒక్కసారిగా షాక్ అయ్యారు.. అయితే ఈ విషయాన్నీ ఆమె ట్విట్టర్ వేదికగా తెలిపారు. సింగర్ కాలి ఇలా ట్విట్ చేశారు.. ''దేశంలో దిగ్భందం ఉన్నప్పటికీ తను కరోనా బారిన పడిందని. ఒక మూడు వారాల పాటు స్వీయ నిర్బంధంలోకి వెళ్తున్నట్లు చెప్పుకొచ్చారు. తన పరిస్థితి కుదురుగానే ఉందని, అయితే ప్రజలు కరోనాకు భయపడకుండా జాగ్రత్తలు పాటించకుండా ఉన్నారని'' షోర్ రాసుకొచ్చారు. కాగా ప్రపంచంలో అన్ని దేశాలలో కంటే కూడా అమెరికాలొనే కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే అమెరికాలో కరోనా వైరస్ కారణంగా మూడు వేలమందికిపైగా మృతి చెందారు.  

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: