టాలీవుడ్ సినిమా పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ విషయమై ఇటీవల పెద్ద రచ్చ చేసిన వర్ధమాన నటి శ్రీరెడ్డి, మొదట ఒక న్యూస్ ఛానల్ లో న్యూస్ రీడర్ గా పని చేయడం తో పాటు అక్కడక్కడా సినిమాల్లో చిన్న పాత్రల్లో నటించింది. అయితే టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ ఉందని, ఇక్కడికి కొత్తగా అవకాశాల కోసం వస్తున్న ఎందరో అమ్మాయిలను మోసం చేసి, ప్రలోభపెట్టి వారికి తప్పకుండా అవకాశం ఇస్తామని చెప్పి, లైంగికంగా వారిని ఇబ్బందులకు కొందరు గురిచేస్తున్నారని అప్పట్లో శ్రీరెడ్డి చేసిన ఆరోపణలు సంచలనం రేపాయి. 

 

స్త్రీల కోసం ప్రత్యేకంగా మా అసోసియేషన్ లో ప్రత్యేక వింగ్ ఏర్పాటు చేసి, వారికి భద్రత కల్పించాలని శ్రీరెడ్డి విజ్ఞప్తి చేసింది, అయితే వారు స్పందించకపోవడంతో ఆ తరువాత మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ముందుకు ఏకంగా అర్ధ నగ్న ప్రదర్శన కూడా చేసి  చివరికి అసోసియేషన్ దిగివచ్చేలా చేసింది. ఆ ఘటనతో శ్రీరెడ్డికి బాగా పేరు రావడం జరిగింది. అయితే దాని అనంతరం కొందరు సినిమా ప్రముఖులు తనను లైంగికంగా ఉపయోగించుకుని అవకాశాలు ఇప్పిస్తాం అని చెప్పి మోసం చేసారని మరికొన్ని ఆరోపణలు చేయడంతో పాటు, ఒక ప్రముఖ నిర్మాత తనయుడితో దిగిన ఫోటోని తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసింది. ఆపై ఒకానొక సమయంలో టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డిపై పలువురు ప్రజలు, పవన్ ఫ్యాన్స్ విరుచుకుపడ్డారు. 

 

ఇక ఆ తరువాత హైదరాబాద్ నుండి తమిళనాడుకు పూర్తిగా షిఫ్ట్ అయిన శ్రీరెడ్డి, ఇప్పటికీ కూడా పవన్ సహా మరికొందరు సినీ, రాజకీయ ప్రముఖులపై విమర్శల బాణాలు సంధిస్తోంది. ఇక ఇటీవల గత కొద్దిరోజులుగా ఆమె పవన్ ని విపరీతంగా టార్గెట్ చేస్తూ పోస్టులు పెడుతుండడంతో పలువురు పవన్ ఫ్యాన్స్ పై ఆమెపై విరుచుకుపడుతూ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే ఇక్కడ పేరు చెడి తమిళనాడు చేరావు, ఈ విధంగానే అక్కడ కూడా పిచ్చి పిచ్చి వేషాలేస్తే, అక్కడి నుండి కూడా వెళ్ళగొడతారు జాగ్రత్త అంటూ కొందరు పవన్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: