ఇప్పటికే కరోనా మహమ్మారి ఎఫెక్ట్ తో అన్ని దేశాలు కూడా ఎంతో భయంతో వణికిపోతున్నాయి. ముఖ్యంగా ప్రజలు ఎవరికి వారు సామజిక దూరం తప్పనిసరిగా పాటిస్తేనే ఈ వ్యాధిని త్వరితగతిన వెళ్లగొట్టచ్చని భావించిన అనేక దేశాల్లో ఇప్పటికే పూర్తిగా లాకౌట్ లు అమలు అవుతున్నాయి. కాగా మన దేశంలో కూడా మొత్తం 21 రోజలు లాకౌట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ కరోనా పట్ల ప్రజలు ఎంతో జాగ్రత్తలు తీసుకోవాలని, ఏదైనా ముఖ్యమైన ఎమర్జెన్సీ ఉంటేనే ఇంటి నుండి బయటకు కాలుపెట్టాలని, అది కూడా కేవలం ఇంటి నుండి ఒక్కరు మాత్రమే వెళ్లాలని సూచిస్తున్నారు. 

 

ఇక ఎప్పటికప్పుడు తమ చేతులను దాదాపుగా 20 సెకండ్ల పాటు రోజులో ఎక్కువసార్లు సబ్బు లేదా శానిటైజర్ తో కడుక్కోవాలి, వాటితో పాటు ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకుంటే ఈ మహమ్మారి నుండి దూరంగా ఉండొచ్చని పలువురు డాక్టర్లు సూచిస్తున్నారు. ఎంత లాకౌట్ ప్రకటించినప్పటికీ కూడా కొందరు ప్రజలు లెక్కచేయకుండా బయటకు వస్తుండడంతో పలువురు రాజకీయ నాయకులు, అధికారులతో పాటు ప్రముఖులు సైతం వారిని బయటకు రావద్దు అంటూ వేడుకొంటున్నారు. ఇక కరోనా ఎఫెక్ట్ ని కొందరు తమకు తోచిన విధంగా వాడుకుంటున్నారు. 

 

ఇప్పటికే కొందరు ఈ కరొనను ఎలా ఎదుర్కొనాలో, ఎవరికి వారు స్వీయ రక్షణ ఎలా తీసుకోవాలో పలు పాటలు రూపొందించడం జరిగింది. అవి ప్రస్తుతం యూట్యూబ్ లో మంచి వ్యూస్ తో కొనసాగుతున్నాయి. కాగా టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మకరోనా పై ఒక పాట రాసానని, నేడు ఫుల్ సాంగ్ ని రిలీజ్ చేస్తానని ప్రకటించారు. కరోనా వైరస్ పైన నేనే రాసి,పాడిన “కనిపించని పురుగు” అనే పాటని రేపు బయట పడేయబోతున్నాను. చేతులు కడుక్కొని వినండి అంటూ వర్మ నిన్న రాత్రి తన సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ లో ఒక పోస్ట్ చేసారు. అయితే వర్మ పాట ఎలా ఉంటుందో వినాలని ఇప్పటినుండే పలువురు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: