తమకు నచ్చిన హీరో గురించి ఎవరు తప్పుగా మాట్లాడిన ఎవరు ఊరుకోరు. ఇక అలా మాట్లాడిన హీరో గారి గురించి ఈ హీరో ఫ్యాన్స్ ట్రోల్స్ చేస్తారు. ఒకే భాషలో ఉన్న స్టార్ ఫ్యాన్స్ మధ్య వార్ కామనే కానీ ఇతర భాషా ఫ్యాన్స్ మధ్య జరుగుతున్న ఈ ఫ్యాన్ వార్ గురించి తెలుసుకోవాల్సిందే. సూపర్ స్టార్ మహేష్, కోలీవుడ్ ఇళయదళపతి విజయ్ ఇద్దరు మంచి క్రేజ్ ఉన్న స్టార్స్. మహేష్ సినిమా వస్తే వంద కోట్లు పక్కా వసూలు చేస్తాడు. విజయ్ సినిమాలు తమిళంలో మంచి విజయాలు అందుకుంటాయ్. 

 

అయితే మహేష్ పై విజయ్ ఫ్యాన్స్ విరుచుకు పడుతున్నారు. మహేష్ ను డమ్మీ స్టార్ అంటూ ట్రోల్ చేస్తున్నారు. యాష్ ట్యాగ్ డమ్మీ స్టార్ మహేష్ అంటూ ట్వీట్స్ చేస్తున్నారు. అయితే మహేష్ ఫ్యాన్స్ కూడా విజయ్ ను రీమేక్ స్టార్ అని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఈ ట్రోల్ ట్వీట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో నానా రచ్చగా మారాయి. విజయ్ ను ట్రోల్ చేస్తున్న మహేష్ ఫ్యాన్స్ కు తమిళంలో అజిత్ ఫ్యాన్స్ సపోర్ట్ దొరికింది. ట్విట్టర్ లో డమ్మీ స్టార్ మహేష్, రీమేక్ స్టార్ విజయ్ అన్న యాష్ ట్యాగ్స్ బాగా వైరల్ అవుతున్నాయి,

 

మహేష్ కు డమ్మీ స్టార్ అని ట్యాగ్ పెట్టిన తమిళ విజయ్ ఫ్యాన్స్ కు సమాధానంగా విజయ్ నటించిన గిల్లి, పోకిరి సినిమాలు ఇక్కడ మహేష్ చేసి హిట్ కొట్టాక విజయ్ చేశాడు. అందుకే విజయ్ ను రీమేక్ స్టార్ అంటూ ట్రోల్ చేస్తున్నారు. అంతకుముందు కూడా మహేష్ మీద ఒక స్టాప్ డప్ కామెడీ షోలో విమర్శించినా విషయం తెలిసిందే. మరి మహేష్ అంటే వాళ్లకు అంట చీప్ గా కనిపిస్తున్నాడేమో కానీ మహేష్ చేస్తున్న సినిమాలు అవి చేస్తున్న వసూళ్ల గురించి తెలిస్తే మాత్రం వాళ్ళు అలా అనే ఛాన్స్ లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: