దేశంలో రామాలయం లేని ఊరు లేదంటే అతిషయోక్తి కాదు అంతగా రాముడు మన జీవితాల్లో కలిసి పోయాడు.. అందుకే శ్రీరామనవమి యావత్ భారతం జరుపుకునే పెద్ద పండుగల్లో ఒకటి.. అందుకే తెలుగు సినిమా శ్రీరాముడు ఓ స్పెషల్ గెస్ట్. ముఖ్యంగా 90లలో శ్రీరామ నవమికి సంబంధించిన చాలా పాటలు వెండితెర మీద సందడి చేసేశాయి. రామకథ వినిపించాయి.

 

తెలుగు నేల మీద రాముని కళ్యాణాన్ని చాలా ఘనంగా జరుపుకుంటారు. ముఖ్యం సాక్ష్యాత్తు ఆ శ్రీరామ చంద్రుడు నడయాడిన భద్రాద్రిలో శ్రీరామ కళ్యాణానికి ఎంతో విశిష్టత ఉంది అందుకే ప్రజలు లక్షల సంఖ్యలో ఆ కళ్యాణ వైభోగాన్ని చూడటానికి తరలివెలతారు.. అలా వెళ్లే దారిలో రామలీలలను కీర్తిస్తూ సేద తీరుతారు. అదే కథతో తెరకెక్కిన సినిమా అందాల రాముడు. అక్కినేని నటించిన ఈ సినిమాలో రామకథను ఎందో అందంగా వినిపించారు.

 

శ్రీరాముని కళ్యాణం అంటే ఊరు ఊరంతా పండుగల జరుపుకుంటారు.. ప్రతి ఒక్కరు ఈ రామచంద్రుడు మా ఊరి దేవుడంటూ.. సీతారాముల కళ్యాణంలో తమ వంతు పాలు పంచుకుంటారు. అందుకే మెగాస్టార్ కూడా రాముడి కళ్యాణమండపంతో చిందేస్తూ అభిమానులను ఉత్సాహ పరిచాడు. మా ఊరి దేవుడు అందాల రాముడంటూ వెలుగెత్తి చాటాడు.


శ్రీరాముని కళ్యాణం మీద ఎన్నో అనుమానాలు కూడా ఉన్నాయి.. శ్రీ రాముని కళ్యాణం తరువాతే అడవుల పాలయ్యాడు.. తన ప్రాణంగా ప్రేమించిన సీతమ్మకు దూరమయ్యాడు మరి ఇలాంటి అనర్థాలకు కారణమయిన ఆ రామ కళ్యాణాన్ని ఏటేటా వేడుకగా జరపటం ఏంటి అనుకుంటున్నారా అయితే ఈ పాట చూడండి మీకే తెలుస్తది.

మరింత సమాచారం తెలుసుకోండి: