కొద్దిపాటి గ్యాప్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాల్లో బిజీ అయ్యారు. పింక్ రీమేక్ గా వకీల్ సాబ్ ఇప్పటికే సెట్స్ మీద ఉండగా ఆ తర్వాత రెండు సినిమాలు లైన్ లో పెట్టారు పవన్ కళ్యాణ్. అందులో క్రిష్ డైరక్షన్ లో సినిమా ఒకటి కాగా మరోటి హరీష్ శంకర్ కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతుందట. హరీష్ శంకర్ తో పవర్ స్టార్ సినిమా అనగానే అందరికి గుర్తొచ్చే సినిమా గబ్బర్ సింగ్. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ దబాంగ్ కు రీమేక్ గా వచ్చిన ఈ సినిమా తెలుగు వర్షన్ బాక్సులు బద్దలయ్యేలా చేసింది. ఖుషి తర్వాత పదేళ్ల వరకు ఒక్క హిట్టు లేని పవన్ కు గబ్బర్ సింగ్ సూపర్ జోష్ ఇచ్చింది. 

 

ఆ సినిమాతో పవర్ స్టార్ మళ్ళీ ఫామ్ లోకి వచ్చారు. హరీష్ శంకర్ కు ఆ మూవీతో సూపర్ క్రేజ్ వచ్చింది. అయితే ఇన్నాళ్లకు మళ్ళీ ఈ కాంబోలో సినిమా వస్తుంది. ఈసారి కూడా హరీష్ శంకర్ పవర్ స్టార్ కోసం ఒక ఫుల్ లెంగ్త్ మాస్ స్టోరీ రాసుకున్నాడట. గబ్బర్ సింగ్ కాదు అంతకుమించే సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడట హరీష్ శంకర్. ఇప్పటికే లైన్ ఒకే చేయగా ఫుల్ స్క్రిప్ట్ పవన్ కు వినిపించే ప్రయత్నాల్లో ఉన్నాడు హరీష్ శంకర్. గడ్డలకొండ గణేష్ తర్వాత హరీష్ చేస్తున్న సినిమా ఇదే అవడం విశేషం. 

 

హరీష్ శంకర్, పవన్ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబందించిన మరిన్ని డిటైల్స్ తెలియాల్సి ఉంది. అయితే ఈ మూవీలో హీరోయిన్ గా మాత్రం లావణ్య త్రిపాఠి నటిస్తుందని అంటున్నారు. హరీష్ శంకర్ డైరక్షన్ పవర్ స్టార్ మూవీలో ఛాన్స్ అంటే లావణ్యకు ఇంత కన్నా క్రేజీ ఆఫర్ మరోటి ఉండదని చెప్పొచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: