కోవిడ్ - 19తో సెలబ్రిటీలకు ఊహించని సమస్యలు వచ్చి పడుతున్నాయి. ప్రస్తుతం ప్రతి సెలెబ్రెటీ సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్న పరిస్థితులలో అభిమానులు సెలెబ్రెటీలను రకరకాల ప్రశ్నలు అడిగి ఇరుకున పెడుతున్నారు. 


ఈమధ్య చిరంజీవి సిసిసి సంస్థకు ఫండ్ ను ఏర్పాటుచేసి పేద సినిమా కళాకారులను ఆదుకుంటున్న పరిస్థితులలో సాయి ధరమ్ తేజ్ కూడ 10 లక్షల విరాళం అందించిన విషయం తెలిసిందే. ఛారిటీకి విరాళం అందించిన సాయి ధరమ్ తేజ్ ను అభినందిస్తూ హరీష్ శంకర్ ఒక అభినందన మెసేజ్ పెట్టాడు. 


ఈ మెసేజ్ పై స్పందిస్తూ ఒక నెటిజన్ సెటైరికల్ గా "అందరికీ డప్పుకొట్టడమేనా.. మీరు కూడా ఏదైనా ఇచ్చేది ఉందా హరీష్ గారు" అంటూ కామెంట్ పెట్టాడు. దీనికి స్పందించిన హరీష్ "మీరు మంచి భాషలో అడిగి ఉంటే నేను కచ్చితంగా బదులిచ్చే వాడిని" అంటూ ఘాటైన రిప్లయ్ ఇవ్వడమే కాకుండా ఇంతకీ కరోనా సమస్య వల్ల తిండి లేకుండాపోయిన పేదవారికి కనీసం ఒక బ్రెడ్ అయినా కొని ఇచ్చావా అంటూ ఆ వ్యక్తి పై హరీష్ శంకర్ మాటలతో ఎదురు దాడి చేసాడు. 


వాస్తవానికి హెల్పింగ్ హ్యాండ్స్ హ్యూమానిటీ అనే సంస్థ హరీష్ అందించిన సాయంగురించి ఈ మధ్యనే వెల్లడించింది. హరీష్ తన పుట్టినరోజు సందర్భంగా తమ సంస్థకు రెండు నెలలకు సరిపడా నిత్యావసరాలను అందించారని స్వీట్స్ స్నాక్స్ డ్రై ఫ్రూట్స్ కేక్స్ కూడా అందించారని తెలుపుతూ హరీష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేసింది. ఈ సంస్థలో 45 మంది పిల్లలుఉన్నారని తెలుస్తోంది  దీనితో హరీష్ చేసిన సహాయం అందరికి తెలియడంతో నెటిజన్లు ప్రశంసలు  కురిపిస్తున్నారు. ఏది ఏమైనా ఈ కరోనా కష్టాల నేపధ్యంలో పీనాసిని కూడ ఉదార స్వభావం ఉండే వ్యక్తిగా కరోనా బలవంతంగా మారుస్తూ మనుష్యులలో మార్పులు తీసుకు రావడానికి తన వంతు ప్రయత్నాలు చేస్తోంది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: