రామ్ గోపాల్ వర్మ... ఈ పేరు నిజానికి సినీ ప్రపంచం గురించి తెలిసిన వారికి అందరికి ఈ పేరు అందరికి తెలిసిందే. ఎందుకంటే ఆయన మాట్లాడే మాటలు ఎవరు ఊహించని విధంగా ఉండడం అలాగే ఆయన తీసే సినిమాలు. ఎవరు ఎన్ని చెప్పిన ప్రపంచమంతా ఒకవైపు నేను ఒక్కడిని ఒకవైపు అన్న వాక్యం రామ్ గోపాల్ వర్మకి కరెక్ట్ గా సెట్ అవుతుంది. అంతేకాకుండా ఆయన ఎప్పటికప్పుడు జరిగే పరిణామాలపై సోషల్ మీడియాలో కామెంట్ చేయడం, వీలైతే సదరు అంశాలపై అతి తక్కువ కాలంలో సినిమాలు చేయడంలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అందరికంటే ఈయన ముందుంటాడు.

 

 

ఇదిఇలా ఉండగా ప్రస్తుతం కరోనా వైరస్‌ కారణంగా ప్రపంచం మొత్తం తలకిందులు అవుతుంటే.. రామ్ గోపాల్ వర్మ మాత్రం దీనిపై ఎప్పటికప్పుడు తనదైన స్టయిల్లో కామెంట్స్ పెడుతూ నెటిజన్ల దృష్టిని ఆయన వైపు చూసేలా చేస్తున్నాడు. ఇవన్నీ మాములుగా జరిగే సంధర్బాలే అయితే తాజాగా కరోనా పై సొంతంగా ఒక పాట కూడా పడి అందరిని ఆచర్యపడేసాడు ఈ కాంట్రవర్సీ డైరెక్టర్. కోవిడ్ పై తానే ఒక పాట రాసి, పాడానని.. దాన్ని బుధవారం నాడు అంతే నేడు ఏప్రిల్ 1 న విడుదల చేస్తున్నానని వర్మ ట్విట్టర్ వేదికగా చెప్పుకొచ్చాడు. కరోనా వైరస్ పైన నేనే రాసి, పాడిన “కనిపించని పురుగు” అనే పాట ప్రోమోని ఈరోజు విడుదల చేసాడు.

 

 

 
అయితే చేతులు కడుక్కుని మరీ ఈ పాట వినాలని వర్మ ఇచ్చిన సలహా కాస్త కొత్తగా అనిపించవచ్చు సగటు తెలుగు ప్రేక్షకులకి. సాధారణంగా ఏ విషయాన్నీ అయినా తనదైన శైలిలో కాస్త విభిన్నంగా ఆలోచించే రామ్ గోపాల్ వర్మ... తన పాటలో కరోనాపై తనకున్న కసిని మొత్తం అంతా పాడి ఆయన వినిపించాడు. ఈ పూర్తి పాటను ఏప్రిల్ 1 వ తేదీన సాయంత్రం 5.30 కి రిలీజ్ చేయనున్నాడు. ఇంకా ఆయన చెవులకి మాస్క్ వేసుకొని తన పాట వినాలని వర్మ కోరడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: