మెగా హీరోలందరికీ సక్సెస్ రేటు చాలా ఎక్కువ. టాలీవుడ్ లో ఎంతో మంచి వారసులున్నా వారంతా మెగా హీరోలంతటి విజయాలని అందుకోలేకపోతున్నారు. అయితే మెగా హీరోలందరిలో వైవిధ్యమైన చిత్రాలని ఎంచుకుంటూ సరికొత్త దారిలో వెళ్తున్న హీరో వరుణ్ తేజ్. తన మొదటి సినిమా ముకుంద నుండి మొన్న వచ్చిన గద్దలకొండ గణేష్ వరకూ ప్రతీ చిత్రంలో వైవిధ్యం చూపిస్తున్నాడు.

 

అయితే ప్రస్తుతం బాక్సింగ్ నేపథ్యమ్లో మరో డిఫరెంట్ కాన్సెప్ట్ తో మన ముందుకు వస్తున్నాడు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ బాక్సింగ్ లో శిక్షణ కూడా తీసుకున్నాడు. ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా చిత్రీకరణ క్యాన్సిల్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది ఇంకా తేలలేదు. కానీ బాలీవుడ్ హీరోయిన్ ని తీసుకునే ఆలోచనలో ఉన్నారట.

 


సల్మాన్ ఖాన్ నటించిన సూపర్ హిట్ చిత్రం 'దబాంగ్ 3' లో హీరోయిన్ గా నటించిన సాయి మంజ్రేకర్ ను వరుణ్ సినిమాకు హీరోయిన్ గా పరిశీలిస్తున్నారట.  ప్రముఖ దర్శకుడు.. నటుడు అయిన మహేష్ మంజ్రేకర్ కూతురే ఈ సాయి మంజ్రేకర్.  'దబాంగ్ 3' సాయి మంజ్రేకర్ కు డెబ్యూ ఫిలిం.  తొలి సినిమాతోనే సాయి మంజ్రేకర్ అందరి దృష్టిని ఆకర్షించింది. అందుకే  వరుణ్ సరసన ఈ కొత్త బాలీవుడ్ బ్యూటీని నటింపజేసేందుకు  ప్రయత్నాలు జరుగుతున్నాయట.


త్వరలోనే ఈ విషయమై నిజానిజాలు అధికారికంగా బయటకి వెల్లడి చేస్తారట. ఇదే నిజమైతే ఈ సినిమాకి మరింత మైలేజ్ యాడ్ అయినట్టే. అయితే బాలీవుడ్ హీరోయిన్లు తెలుగులో సినిమాలు చేయాలంటే భారీ మొత్తంలోనే డిమాండ్ చేస్తారు. మరి అంత భారీగా డిమాండ్ చేసే హీరోయిన్ ని వరుణ్ తేజ్ సినిమాలో తీసుకుంటారా లేదా అన్నది సందేహంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: