కొరటాల శివ చిరంజీవిల ‘ఆచార్య’ మూవీని ఆగష్టు 14న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేయాలని మొదట్లో భావించారు. ఆ తరువాత ఈ మూవీ షూటింగ్ రకరకాల కారణాలతో ఆలస్యం అయిన పరిస్థితులలో కనీసం ఈ ఏడాది దసరాకు అయినా విడుదల చేయాలని భావిస్తూ వచ్చారు. ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ కరోనా సమస్యలు వల్ల వాయిదా పడటంతో ఈ మూవీలో చిరంజీవితో సమానంగా మరో కీలక పాత్రను పోషిస్తున్న రామ్ చరణ్ ని మధ్యలో పంపే ఆలోచన లేదు అని రాజమౌళి స్పష్టం చేయడంతో ఈ మూవీ దసరాకు కూడ విడుదల చేయడం కష్టం అని అంటున్నారు. 

 

సంక్రాంతికి ‘ఆర్ ఆర్ ఆర్’ వస్తుంది కాబట్టి ఆ మూవీ విడుదల అయ్యాక తీరికగా ‘ఆచార్య’ ను 2021 సమ్మర్ కు వాయిదా వేసే పరిస్థితులు స్పష్టంగా ఉన్నాయి అన్న సంకేతాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఫిలిం ఇండస్ట్రీలో ఒక స్తబ్ధవాతావరణం నెలకొని ఉండటంతో చాలామంది ప్రముఖ బయ్యర్లు ప్రస్తుతం చేసే పనిలేక కొరటాల శివ కు ఫోన్ చేసి ‘ఆచార్య’ విడుదల గురించి ఒక క్లారిటీని అదేవిధంగా ఆ మూవీకి సంబంధించిన ఏరియా ఆఫర్స్ గురించి ఎంక్వైరీలు చేస్తున్నట్లు టాక్.  


అయితే ఈ సినిమాకు సంబంధించి అన్ని ఏరియాలకు ‘అల వైకుంఠపురములో’ సాధించిన కలెక్షన్స్ రేటుకు ‘ఆచార్య’ సినిమా రేట్స్ ను అమ్మాలని ఆలోచిస్తున్నాము అని కొరటాల మెగా కాంపౌండ్ అభిప్రాయాలను చూచాయిగా తెలియ చేస్తే ఆరేట్లు విని కరోనా ఇచ్చిన షాక్ అంత కంటే పెద్ద షాక్ అని ఫీల్ అవుతున్నట్లు టాక్. ఇలా కొరటాల శివ చెప్పడానికి ఒక కారణం ఉంది అని అంటున్నారు. 


ఇప్పటి వరకు కొరటాలదర్శకత్వం వహించిన సినిమాలు అన్నీ సూపర్ హిట్ కావడంతో పాటు ఇప్పుడు ‘ఆచార్య’ లో చిరంజీవి కొరటాల కాంబినేషన్ తో పాటు చరణ్ ప్రత్యేక పాత్రను కూడా హైలెట్ చేసి కొరటాల బయ్యర్ల మైండ్ ను బ్లాంక్ చేస్తున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉండగా రేపు రాబోతున్న శ్రీరామనవమి రోజున ‘ఆచార్య’  లోగో డిజైన్ తో పాటు, చిరు ఫస్ట్ లుక్ వచ్చే ఛాన్స్ ఉంది.చిరంజీవి ఫస్ట్ లుక్ వచ్చే ఆస్కారం ఉంది అన్న సంకేతాలు వస్తున్నాయి. అయితే ప్రస్తుతం చిరంజీవి కరోనా క్రైసిస్ ఛారిటీ పనిమీద బిజీగా ఉన్నాడు. చిరంజీవి పిలుపుతో టాలీవుడ్ నుంచి అంతా తమకు తోచిన విరాళాలు ఇస్తున్నారు. ఇలాంటి టైమ్ లో ఆచార్యతో ట్రాక్ మారిస్తే సీసీసీ స్ఫూర్తి దెబ్బతింటుందేమో అని చిరంజీవి  సందేహపడుతూ రేపటి ఫస్ట్ లుక్ విడుదల గురించి కూడ సందేహాలు వ్యక్తపరుస్తున్నట్లు తెలుస్తోంది..

మరింత సమాచారం తెలుసుకోండి: