ప్రపంచంలో కరాళ నృత్యం చేస్తున్న కరోనా వైరస్ రోజు రోజు కీ ప్రాణాలు తీస్తుంది.  ప్రపంచ దేశాల్లో లాక్ డౌన్ చేసినప్పటిక కొంత మంది నిర్లక్ష్యం రోజు రోజుకీ ఈ కేసులు పెరిగేలా చేస్తున్నాయి.  ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తోంది.  కరోనా వైరస్ ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. చైనాలో  ని పుహాన్ లో మొదలైన ఈ భయంకరమైన వైరస్ ప్రపంచాన్ని సర్వనాశనం చేస్తుంది.  ఇప్పటికీ  ఈ వైరస్ 195 దేశాలకు పైగా వ్యాపించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఐరోపా దేశాల్లో క్రమక్రమంగా ఈ వైరస్ పెరుగుతూ వస్తుంది.

 

ఇక ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీ సహా పలు దేశాలలో దీని ప్రభావం ఎక్కువగా ఉందని చెప్పాలి. ఇక ఇటలీలో అయితే ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఇప్పటికి పది వేల మంది మరణించారు.  కరోనా మహమ్మారి వల్ల ప్రముఖ నటులు మృతి చెందారు.  'స్టార్‌ వార్స్‌' సీరీస్ ఫేమ్‌ ఆండ్రూ జాక్‌ కరోనా వైరస్‌ సోకి, కన్నుమూశారు. ఆయన వయసు 76 సంవత్సరాలు. రెండు రోజుల క్రితం ఆయనకు జరిపిన రక్త పరీక్షల్లో కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో ఆయన్ను సర్రేలోని ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్చగా, పరిస్థితి విషమించి, మంగళవారం ఆయన చనిపోయారు.

 

ఈ విషయాన్ని ధ్రువీకరించిన ఆండ్రూ జాక్ ప్రతినిధి జిల్‌ మెక్ లాగ్‌, ఆయన మృతి తమకు తీరని లోటని అన్నారు.  హాలీవుడ్ స్టార్ హీరోలు రాబర్ట్‌ డౌనీ జూనియర్‌, క్రిస్ హేమ్స్‌ వర్త్‌ లకు డయలెక్ట్‌ కోచ్‌ గానూ ఆయన వ్యవహరిస్తున్నారు.'స్టార్‌ వార్స్‌' సీరీస్ 7, 8లో ఆండ్రూ జాక్ నటించారు.  ప్రస్తుతం జాక్ భార్య గేబ్రియల్‌ రోజర్స్‌ ఆస్ట్రేలియాలో ఉన్నారు. భర్త మరణం గురించి తెలిసిన తరువాత ఆమె స్పందిస్తూ, రెండు రోజుల క్రితం తన భర్తకు కరోనా పాజిటివ్‌ వచ్చిందని, ఆయన ఎటువంటి బాధా లేకుండా కన్నుమూశారని వెల్లడించారు.

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: