వరుస సక్సెస్ లతో దూసుకుపోతూ తెలుగులో ప్రస్తుతం టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది ముంబై బ్యూటీ పూజా హెగ్డే. ప్రస్తుతం పూజా తెలుగులో ప్రభాస్ 20లో అలాగే అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ చిత్రాల్లోనటిస్తుంది. అయితే తాజాగా ఆమె తమిళం లో స్టార్ హీరో సూర్య సరసన అరువా అనే చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని కొద్దీ రోజుల క్రితం వార్తలు వచ్చాయి దీని గురించి పూజా ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతానికైతే ఏ ఒక్క తమిళ సినిమా కు సైన్ చేయలేదు కానీ  అన్ని కుదిరితే  ఈఏడాది కోలీవుడ్ లో సినిమా చేస్తానని వెల్లడించింది. 
 
 
ఇదిలావుంటే సింగం ఫేమ్ హరి తెరకెక్కించనున్న అరువా లో సూర్య డ్యూయెల్ రోల్ లో కనిపించనున్నాడని సమాచారం. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది.ఈ సినిమాతో పాటు సూర్య , విశ్వాసం ఫేమ్ శివ డైరెక్షన్ లో కూడా నటించాల్సి వుంది. ఇక సూర్య ప్రస్తుతం గురు ఫేమ్ సుధా కొంగర డైరెక్షన్ లో ఆకాశం నీ హద్దురా అనే చిత్రం లో నటిస్తున్నాడు. ఇటీవలే  షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే లో విడుదలకానుంది. 2డి ఎంటర్ టైన్మెంట్స్ ,సిఖ్య ఎంటర్ టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం లో అపర్ణ బాలమురళి హీరోయిన్ గా జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. ఇటీవల వరుస పరాజయాలతో సతమవుతున్న సూర్యసినిమా పై భారీ ఆశలు పెట్టుకున్నాడు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: