విషయం ఏమయ్యుంటుంది అనే ఆత్రుత మీలో కలుగుతోంది కదా... అక్కడికే వస్తున్నాను.. సుమారు నాలుగు దశాబ్దాలకు పైనే సినీ జీవితం వున్న తెలుగు తెర ముద్దుబిడ్డ... మన మెగాస్టార్ చేయని పని, అతని తమ్ముడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్... కొడుకు రామ్ చరణ్ చేసి చూపించారు... అదేంటే తెలుసా... బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ సినిమాల రీమిక్స్ లో నటించడం.. 

 

మెగాస్టార్ చిరంజీవి.. సినిమా జీవితాన్ని మనం పరిశీలించినట్లయితే.. కోలీవుడ్, బాలీవుడ్, మోలీవుడ్, శాండిల్ వుడ్ అనే తేడా లేకుండా... అన్ని భాషల్లోనూ సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాలను ఎంచుకొని... ఎన్నో హిట్లను అయన ఖాతాలో వేసుకున్నారు... ముఖ్యంగా మాస్ ఆడియన్స్ దృష్టిలో ఉంచుకొని, అయన చేసిన సినిమాలకు అభిమానులు బ్రహ్మ రధం పట్టడం మనకు తెలిసినదే. 

 

అయితే ఇన్ని సినిమాల్లో నటించిన అతను... మన బిగ్ బి అమితాబ్ బచ్చన్ చేసిన ఏ ఒక్క సినిమా రీమేక్ లోనూ నటించకపోవడం, ఓ రకంగా గమ్మత్తైన విషయమే. అయితే అలనాడు అమితాబ్ నటించిన ‘ముఖద్దర్ కా సికిందర్’ తెలుగు రీమేక్‌ ‘ప్రేమ తరంగాలు’ సినిమాలో చిరు నటించినప్పటిని... అందులో వినోద్ ఖన్నా పాత్రను పోషించడం గమనార్హం. ఈ రకంగా ఎందరో సూపర్ స్టార్ సినిమాలను రీమేక్ చేసిన చిరంజీవి, అమితాబ్ బచ్చన్ చేసిన ఏ పాత్రను తెలుగులో చేయలేదు.

 

అయితే... ఆ ముచ్చటను డైరెక్ట్ గా ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో అమితాబ్ ను ఒప్పించి, తీర్చేసుకున్నాడు మన మెగాస్టార్. ఇక పవన్ అండ్ రాంచరణ్ విషయానికొస్తే.... అమితాబ్ బచ్చన్ నటించిన ‘జంజీర్’ సినిమాను హిందీలో అదే టైటిల్‌తో ‘జంజీర్’గా రీమేక్ చేసి, చేయి కాల్చుకున్న సంగతి తెలిసినదే కదా... అలాగే, ఇపుడు పవర్ స్టార్ అమితాబ్ 'పింక్' సినిమాను 'వకీల్ సాబ్' పేరిట తెలుగులో రూపొందుతున్న సినిమాలో... సదరు కీ రోల్ పోషిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: