మెగా ఫ్యామిలీ హీరోగా టాలీవుడ్‌ కు పరిచయం అయి అల్లు అర్జున్ తరువాత తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల బన్నీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 17 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కొన్ని మీడియా సంస్థలు ఆయన్ను ఇంటర్యూ చేశాయి. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


అల వైకుంఠపురములో సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు కథ ఆ స్టార్‌ డమ్‌ ను ఎలా డీల్ చేస్తున్నారన్న ప్రశ్నకు బదులుగా.. `ఇవన్నీ జీవితంలో భాగం అనుకుంటాను. నిజంగా చెప్పాలంటే ఈ స్థాయికి రావాలనే ఇన్నాళ్లు ఎంతో కష్టపడ్డాను` అన్నాడు బన్నీ. అంతేకాదు `అభిమానులు నాపై చూపిస్తున్న ప్రేమానురాగాలను ఆస్వాధిస్తున్నాను. ఇదే నేను కోరుకున్నది. ఇప్పుడు అదే పొందటం ఆనందంగా ఉంది` అన్నాడు.

 

మెగా ఫ్యామిలీ హీరో అన్న భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన బన్నీ ఆర్య, దేశముదురు, జులాయి, రేసుగుర్రం, సరైనోడు లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించాడు. ఇక నటుడిగానే కాదు బన్నీ డ్యాన్స్‌ కు కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు బన్నీ యాక్టింగ్, డ్యాన్స్‌ లకు మలయాళ ఇండస్ట్రీలోనూ చాలా మంది ఫ్యాన్స్‌ ఉన్నారు. పలువురు బాలీవుడ్ స్టార్లు కూడా బన్నీ డ్యాన్స్‌ అంటే ఇష్టమంటూ స్టేట్‌మెంట్లు ఇచ్చారు.

 

అయితే తాజా ఇంటర్వ్యూలో డాన్స్ బేస్డ్ సినిమా గురించి స్పందించిన అల్లు అర్జున్ తన మనసులో మాట బయట పెట్టాడు. తనకు పూర్తి స్థాయి డాన్స్ బేస్డ్ సినిమా చేసే ఆలోచన ఏది లేదని చెప్పాడు బన్నీ. సినిమాలో డాన్స్ అనేది ఓ చిన్న భాగం మాత్రమే అన్న బన్నీ, తనను నుంచి అభిమానులు ఆశించే అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమా చేయటమే తనకు ఇష్టమని చెప్పాడు బన్నీ.

మరింత సమాచారం తెలుసుకోండి: