కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా మృత్యుఘంటికలు మోగిస్తోంది. ఈ నేపథ్యంలో ముందుగానే స్వదేశాలకు, స్వస్థలాలకు చేరుకున్న వారి పరిస్థితి పరవాలేదు గానీ.. ఆలస్యమైన వారి పరిస్థితి మాత్రం దయనీయంగా ఉంది. సామాన్యులు ఆకలి దప్పులతో అలమటిస్తుంటే సెలబ్రిటీలు సరైన ట్రాన్స్‌ఫోర్టేషన్‌ లేక తమ వారిని చేరుకోలేకపోతున్నారు. తాజాగా ఓ మలయాళ స్టార్ హీరోకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. 

 

కరోనా విలయతాండవం చేస్తున్న ప్రమాధకర పరిస్థితుల్లోనూ ఓ హీరో షూటింగ్ చేసే సాహసం చేశాడు. మలయాళ స్టార్ హీరో పృథ్వీ రాజ్‌ సుకుమారన్ హీరోగా బ్లెస్సీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆడు జీవితం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జోర్డాన్‌ లో జరుగుతోంది. అక్కడి పరిస్థితి బాలేదని షూటింగ్ ఆపేయాలని అధికారులు సూచించినా పృథ్వీ రాజ్‌ మాత్రం షూటింగ్ కొనసాగించాడు. అయితే షూటింగ్ పూర్తయినా అప్పటికే విదేశీ విమానాలు భారత్‌లో నిశేధించటంతో వారు ఇండియాకు చేరకోలేకపోయారు.

 

ఈ చిత్రయూనిట్ 57 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ప్రస్తుతం వారంతా జోర్డాన్‌లోని ఓ ఎడారి ప్రాంతంలో చిక్కుకుపోయారు. వారికి సరిపడా ఆహారం కూడా దొరకటం లేదట. ఈ పరిస్థితుల్లో వారిని తిరిగి ఇండియాకు రప్పించేందుకు మలయాళ ఇండస్ట్రీ పెద్దలు ప్రయత్నిస్తున్నారు. కానీ రెండు దేశాల్లోనూ ఆంక్షలు కొనసాగుతుండటంతో ఎవరూ ఏమి చేయలేని పరిస్థితి.

 

అయితే ఈ పరిస్థితికి కారణం చిత్రయూనిట్ నిర్లక్షమే అని తెలుస్తోంది. ఆ పరిస్థితుల్లో షూటింగ్ చేయటం ప్రమాదకరమని తెలసినా షూటింగ్ కంటిన్యూ చేశారు. ఒకసారి షూటింగ్ ఆపి వెనక్కి వచ్చేస్తే తిరిగి అక్కడికి వెళ్లి షూటింగ్ చేయటం నిర్మాతకు భారం అవుతుందన్న ఉద్దేశంతోనే షూటింగ్ కంటిన్యూ చేవామని చిత్రయూనిట్‌ చెపుతున్నారు. అయితే డబ్బుకన్నా ప్రాణాలు ముఖ్యమని మాత్రం పట్టించుకోలేదు ఆడు జీవితం యూనిట్.

మరింత సమాచారం తెలుసుకోండి: