బాహుబలి మూవీ భారత దేశ చలన చిత్ర చరిత్రను తిరగరాసిన చిత్రం.  ఓ విధంగా హాలీవుడ్ ని సైతం కెలికి పారేసింది. మేము కూడా పోటుగాళ్ళమేనని చెప్పింది. అటు బాలీవుడ్ పొగరు ని కూడా దించేసింది. సౌత్ వైపు అంతా చూసేలా చేసిన క్రెడిట్ అచ్చంగా రాజమౌళిదే. 

 

అటువంటి బాహుబలి మూవీని మేకర్ అయిన రాజమౌళి నచ్చుకోవడంలేదా. అంటే తప్పక నచ్చుకుంటానని, అయితే తనకు అంతకంటే ఎక్కువగా నచ్చిన చిత్రం ఈగ అంటున్నారు ఈ పాన్ ఇండియా డైరెక్టర్  లేటెస్ట్ గా క్రిటిక్ రాజీవ్ మసంద్‌కు ఇచ్చిన ఒక వీడియో ఇంటర్వ్యూలో తన మనసులో మాటలను పంచుకున్నారు.

 

తనకు ఈగ మూవీ అంటే అదో రకమైన ప్రేమ, గౌరవం అని కూడా రాజమౌళి  చెప్పారు. ఆ మూవీ తనకు ఎంతో రిస్క్ గా అనిపించిందని కూడా చెప్పారు. ఈగను మెయిన్ క్యారక్టర్ గా పెట్టి రివెంజి టైప్ మూవీ తీయడం అంటే అది తనకు చాలా సాసహంగా అనిపించిందని చెప్పారు.

 

మూవీ తీసి సక్సెస్ అయిన తనకు ఇంక ఎటువంటి పెద్ద సినిమాలు అయినా చేసేవిధంగా ధైర్యం వచ్చిందని, అందువల్ల తాను ఈగకు ఎప్పటికీ థాంక్స్ కూడా చెబుతానని అన్నాడు. మొత్తానికి బాహుబలి సిరీస్ తో మొత్తం సినీ జగత్తునే తన వైపు తిప్పుకున్న రాజమౌళి ఇష్టమైన సినిమా మాత్రం ఈగ అంటున్నారు. ఆయన ద్రుష్టిలో హీరో అంటే ఈగ అని కూడా చెబుతున్నారు. నిజంగా ఇది గ్రేట్ అనుకోవాలేమో.

 

ఏది ఏమైనా స్టార్ హీరోలు తాము లేకపోతే సినిమా లేదని అనుకుంటున్న వేళ ఈగతో సినిమా తీసి బ్లాక్  బస్టర్ హిట్ కొట్టిన అసలైన హీరో రాజమౌళి అనే చెప్పాలి. ఇక రాజమౌళిని మించిన స్టార్ హీరో, సూపర్ స్టార్ వేరే ఉంటాడా. అది కూడా నిజమే కదా.

మరింత సమాచారం తెలుసుకోండి: