ప్రస్తుతం కరోనా మహమ్మారి నేపథ్యంలో దాదాపుగా చాలాదేశాలు అన్ని కూడా తమ ప్రజలను పూర్తిగా ఇళ్లకు పరిమితం చేయడం జరిగింది. ఇక మన దేశాన్ని కూడా ఈనెల 15 వరకు లాకౌట్ చేస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించడం జరిగింది. అయితే కరోనాను త్వరగా అంతమొందించడానికి ఇదే సులువైన మార్గం అని తలచి ప్రధాని ఈ సూచన చేయడం జరిగింది. కాగా ఇటీవల ఒకరోజు పాటు ప్రధాని ప్రకటించిన జనతా కర్ఫ్యూ ఎంతో విజయవంతం అయింది. అయితే ఆ తరువాత హఠాత్తుగా ఏకంగా 21 రోజులు లాకౌట్ ప్రకటించడంతో ప్రజల్లో కూడా కొంత ఆందోళన మొదలయింది. 

 

అయితే కరోనా తీవ్రతను గ్రహించిన మెజారిటీ ప్రజలు పూర్తిగా ఇళ్లకే అంకితం అవ్వగా, అక్కడక్కడా కొందరు మాత్రం ఈ లాకౌట్ ని పెద్దగా లక్ష్య పెట్టడం లేదు. దానితో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రముఖులు అందరూ కూడా ప్రజలకు కరోనా యొక్క తీవ్రత, తీసుకోవలసిన జాగ్రత్తలు, పాటించవలసిన నియమాల గురించి తమకు వీలైనంతగా సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా, అలానే టివిల ద్వారా ప్రకటనలు చేస్తున్నారు. అయితే ఇటువంటి సంచలన విషయాలపై తనదైన శైలిలో స్పందించే అలవాటున్న వర్మ, కొద్దిరోజులుగా కరోనా పై కూడా తన ట్విట్టర్ ద్వారా పంచ్ లు వేస్తూ పోస్టులు పెడుతున్నారు. 

 

ఇక నిన్న ఏకంగా కరోనా పై ఒక ఒక పాటను రాసి ఆలపించానని నేటి ఉదయం దాని ప్రోమో టీజర్ ని రిలీజ్ చేసారు వర్మ. ఇకపోతే కాసేపటి క్రితం ఆ సాంగ్ ఫుల్ వర్షన్ ఐ యూట్యూబ్ లో రిలీజ్ చేసిన వర్మ, ప్రతి ఒక్కరూ కూడా చెవులకు మాస్కులు వేసుకుని, చేతులు శుభ్రం చేసుకుని మరీ ఆ సాంగ్ ని వినాలని ఛలోక్తులు పేల్చారు. కాగా మంచి ఎనర్జిటిక్ గా కరోనా పై వర్మ పాడిన ఆ కనిపించని పురుగు సాంగ్ వీడియో యూట్యూబ్ లో ప్రస్తుతం మంచి వ్యూస్ తో దూసుకుపోతోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: