ప్రపంచం మొత్తం కరోనా భయంతో ఎక్కడిక్కడ స్థంభించిపోయిన విషయం తెలిసిందే.  ఇప్పటికే దేశంలో లాక్ డౌన్ చేశారు.  అయిత కరోనా వైరస్ వల్ల ఎక్కువగా ఎఫెక్ట్ పడ్డది మాత్రం సినీ పరిశ్రమకే అని చెప్పొచ్చు.  కరోనా వల్ల సినిమా షూటింగ్స్ మొత్తం వాయిదా పడ్డాయి.  సినీ కార్మికులు నానా అవస్థలు పడుతున్నారు.  ఈ నేపథ్యంలో సినీ సెలబ్రెటీలు తమ ఇంటి పట్టునే ఉంటూ.. తమ కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. స్టార్ హీరోలు పీఎం, సీఎం ఫండ్స్ కి డొనేషన్ చేస్తున్న విషయం తెలిసిందే.  బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ ఇలా అన్ని సినీ పరిశ్రమకు చెందిన సెలబ్రెటీలు తమకు స్థాయిని బట్టి డొనేట్ చేస్తున్నారు. 

 

మరోవైపు లాక్ డౌన్ నేపథ్యంలో ఇంటి పట్టున ఉంటున్నారు.  ఎవరూ కూడా దాదాపుగా బయటకు రావడం లేదు.  అన్ని రంగాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొన్నది.  సినిమా రంగం పరిస్థితి కూడా ఇంతే.  ప్రతి రోజూ ఏదో ఒక షూటింగ్ బిజీలో ఉండే సినీ హీరోయిన్లు తమ ఇంట్లో సంతడి చేస్తూ ఆ వీడియోలు సోషల్ మాద్యమాల్లో షేర్ చేస్తున్నారు. తనకు నచ్చిన వచ్చిన వంటలను తయారు చేసుకొని హ్యాపీ గా ఎంజాయ్ చేస్తున్నారు.  టాలీవుడ్ హాట్ హీరోయిన్ నిధి అగర్వాల్ తనకు ఇష్టమైన కేక్ ను ఇంట్లోనే తయారు చేసుకుంది. 

 

తొలి సినిమాతోనే అందాలు ఆరబోస్తూనే తన డాన్సులతో అదరగొట్టింది. ఇప్పుడు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తున్న సంగతి తెలిసిందే. మొన్నటి దాకా హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ హీట్ పెంచిన ఈ భామ ఇప్పుడు హాట్ కేకులు తయారు చేస్తూ సమయం గడుపుతోంది. కేక్స్ బేక్ చేస్తూ – వాటిని టేస్ట్ చేస్తూ ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: