టాలీవుడ్ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దాదాపుగా రెండేళ్ల గ్యాప్ తరువాత ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో బాలీవూడ్ మూవీ పింక్ రీమేక్ గా తెరకెక్కుతున్న వకీల్ సాబ్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. దిల్ రాజు, బోనీ కపూర్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో అంజలి, నివేత థామస్ ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా యువ సంగీత తరంగం ఎస్ ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు సిద్ శ్రీరామ్ ఆలపించిన మగువ మగువ సాంగ్ యూట్యూబ్ లో రిలీజ్ అయి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ సంపాదించడం జరిగింది. 

 

ఇకపోతే ఈ ఏప్రిల్ నెల పవర్ స్టార్ ఫ్యాన్స్ కు ఎంతో ప్రత్యేకమైన నెల అని చెప్పాలి. ఎందుకంటే, ఈ నెలలో మొత్తం పవన్ నటించిన ఆరు సినిమాలు ఈ నెలలోనే విడుదల కాగా అందులో మూడు సినిమాలు సూపర్ హిట్ కొట్టగా, మిగతా మూడు మాత్రం సక్సెస్ కాలేదు. ఏప్రిల్ 2న పవన్ నటించిన జల్సా రిలీజ్ అయింది, అలానే ఏప్రిల్ 8న సర్దార్ గబ్బర్ సింగ్, ఏప్రిల్ 14న తీన్ మార్, ఏప్రిల్ 20న బద్రి, ఏప్రిల్ 25న జానీ, అలానే ఏప్రిల్ 27న ఖుషి రిలీజ్ అవడం జరిగింది. 

 

కాగా వీటిలో ఖుషి అతి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టగా, బద్రి సూపర్ హిట్, జల్సా హిట్ సాధించగా, సర్ధార్ గబ్బర్ సింగ్, తీన్ మార్, జానీ సినిమాలు మాత్రం ఫ్లాప్ సినిమాలు గా నిలిచాయి. ఇక అన్నిటికంటే ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ తనయుడు అకీరానందన్ పుట్టినరోజు ఇదే నెల 8న కావడంతో పవన్ ఫ్యాన్స్ కు ఈ ఏప్రిల్ నెల ఎంతో ప్రత్యేకమైనదని అంటున్నారు సినీ విశ్లేషకులు. కాగా అందుతున్న సమాచారాన్ని బట్టి అతి త్వరలో పవన్, హరీష్ శంకర్ ల కాంబోలో తెరకెక్కనున్న సినిమా కూడా వచ్చే ఏడాది సరిగ్గా ఖుషి రిలీజ్ డేట్ అయిన ఏప్రిల్ 27న రిలీజ్ కానున్నట్లు టాక్....!!

మరింత సమాచారం తెలుసుకోండి: