మ‌న హీరోయిన్లు ప‌చ్చ‌బొట్టు వేసుకుంటున్నారు. కాక‌పోతే దాని పేరు ఇప్పుడు టాటూగా మారింది. మోడ్ర‌న్ యుగంలో మ‌న సుంద‌రాంగులు దానికి త‌గ్గ‌ట్టుగా త‌మ ఆలోచ‌న‌లకి క్రియేటివిటీని జోడించి అభిరుచుల‌కు అనుగుణంగా ఆక‌ర్ష‌ణీయంగా టాటూలు వేయించుకుంటున్నారు. విదేశాల్లో అత్య‌ధికంగా క‌నిపించే ఈ టాటూ క‌ల్చ‌ర్ మీద మోజు పెంచుకుంటున్న మ‌న హీరోయిన్లలో ఎవ‌రి ఒంటి మీద ఎన్ని టాటూలు ఉన్నాయి..ఎక్క‌డున్నాయి..ఎలా ఉన్నాయ‌న్న‌దానిమీద ఓ లుక్కేద్దాం.

 

గీత‌గోవిందంలో కోర‌కోర చూపుల‌తో మేడ‌మ్ ర‌ష్మిక త‌న కుడిచేతి మీద టాటూ వేయించుకుంది. ఎర్రీప్లేస‌బుల్ అని పొడిపించుకున్న ఆ ప‌చ్చ‌బొట్టుకి అర్ధం భ‌ర్తీ చేయ‌లేరు అని. ఓ బేబితో మ‌రో హిట్ కొట్టిన స‌మంత త‌న‌కి నాగ‌చైత‌న్య‌తో ప్రేమ‌పెళ్ళికి కార‌ణ‌మైన ఈ టాటూ ఏమాయ‌చేశావు సినిమా గుర్తు చేసుకునేలా మెడ పైన వైఎంసి అని టాటూవేసుకుంది దీంతోపాటు మ‌ణిక‌ట్టు మీద ప‌క్క‌టెముల పైన మ‌రో రెండు టాటూలు వేయించుకుంది. చైతూ పై ప‌రేమ‌తోనే ఆ ప్రేమ‌ను వ్య‌క్త‌ప‌రిచేందుకే అలా వేయించుకున్నాన‌ని ముద్దు ముద్దుగా చెబుతోంది.

 

తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ అగ్ర‌తార న‌య‌న‌తార త‌మ ఎడ‌మ చేతిపైన పి అని టాటూ వేయించుకుంది. గ‌తంలో ఆమె ప్ర‌భుదేవాతో డేటింగ్‌లో ఉన్న‌ప్పుడు పి అంటే ప్ర‌భుదేవా అని అర్ధం వ‌చ్చేలా వేయించుకుని ఆ ప‌ని చేసింది. త‌ర్వాత వారిద్ద‌రి మ‌ధ్య బ్రేక‌ప్ కావ‌డంతో పి అక్ష‌రాన్ని క‌లుపుకుంటూ పాజిటివిటీ అని రాయించుకుంది. ప‌చ్చ‌బొట్టు మార్చుకుందికానీ పాత జ్ఞాప‌కాల‌ను మార్చుకోలేదు క‌దా అని ఆమె పై సెటైర్ల వ‌ర్షం కురుస్తోంది. 

 

మ‌రో ద‌క్షిణాది భామ అదే ప్ర‌భుదేవాతో చాలా స‌న్నిహితంగా ఉంటూ...వారిద్ద‌రి బ్రేక‌ప్‌కి కార‌ణ‌మైన త్రిష ఒంటినిండా నాలుగు ప‌చ్చ‌బొట్లు అతుక్కుపోయాయి. చాలా రోజుల క్రిత‌మే ఆమె ఎద‌పై చేప ఆకృతిని వేయించుకుంది. తేలు ఆకారాన్ని చేతిపైన వేయించుకుంది. 2016లో 50 సినిమాలు పూర్తి చేసుకున్న కార‌ణంగా కెమెరా, క్లాప్‌బోర్డ్‌ని త‌న ఎడ‌మ భుజ‌ము పై పొడిపించుకుంది. ఆమె సినిమాలో న‌గ్నంగా న‌టించి వార్త‌ల్లోచి ఎక్కిన అమ‌లాపాల్ త‌న కుడికాలు పై ప‌చ్చ‌బొట్టు వేయించుకుంది. అంతేకాక వీపు మీద కూడా ఓ టాటూని వేయించుకుంది.

 

ఊరి నుంచి చాలా తీసుకున్నారు తిరిగి ఇచ్చేయ‌క‌పోతే లావ‌యిపోతారు అంటూ సంద‌డి చేసిన శృతిహాస‌న్ శ‌రీరం పై ముచ్చ‌ట‌గా మూడు ప‌చ్చ‌బొట్లు కొలువుతీరాయి. ఎడ‌మ‌చేతి పై ఓ పువ్వు, మ్యూజిక్ అంటే ప్రాణం గీతాన్ని విని ఆస్వాదిస్తాను అనే విధంగా చెవి వెన‌క‌భాగంలో ఓ మ్యూజిక్ కి సంబంధించిన ఓ సింబ‌ల్‌ని వేయించుకుంది. భుజం పైన త‌మిళ భాష‌లో త‌న పేరును వేయించుకుంది.

 

య‌మ‌దొంగ‌లో ఎన్టీఆర్‌తో ఆడిపాడిన సింగ‌ర్ క్యాన్స‌ర్‌ను జ‌యించిన మాజీ హీరోయిన్ మ‌మ‌తా మోహ‌న్‌దాస్‌కి దైవ‌భ‌క్తి ఎక్కువే దాంతో ఆమె చేతి భుజం పై ఓమ్ ఆకారాన్ని విగ్నేశ్వ‌రుడ్నిప్ర‌తిబింబించేలా టాటూ వేయించుకుంది. అదే య‌మ‌దొంగ‌లో ఎన్టీఆర్‌తో ఆడిపాడిన మాజీ హీరోయిన్ ప్రియ‌మ‌ణి త‌న ఎడ‌మ చేతి పై త‌న తండ్రి పై ప్రేమ‌ను కురిపిస్తూ డాడీ గ‌ర్ల్ అంటూ వేయించుకుంది. హీరోయిన్ నుంచి నిర్మాత‌గా మారిన ఛార్మీ లిమిటెడ్ ఎడిష‌న్  అని ఒక ప‌చ్చ‌బొట్టు పొడిపించుకుంది.

 

నా మ‌నసును గెలిచిన‌ప్పుడే న‌న్ను పొంద‌గ‌ల‌వు అన్న మీనింగ్ వ‌చ్చేలా స్పానిష్ లాంగ్వేజ్ లో కాలిపై కూడా మ‌రో టాటూని వేయించుకుంది. టాలీవుడ్ బ్యూటీ స‌లోని త‌న కుడిభుజం పై భాగంలో టాటూను వేయించుకుంది. యాంక‌ర్ అన‌సూయ నిక్కూ అనే పేరును త‌న ఎద పైన వేయించుకుంది. ఫైర్ బ్రాండ్ రోజా కూడా త‌న ఎద పైన సీతాకోక చిలుక‌తోపాటు పువ్వుటాటూను వేయించుకుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: