రామ్‌గోపాల్ వ‌ర్మ ఏం చేసినా సంచ‌ల‌న‌మే.. ఇప్పుడు క‌రోనా విష‌యంలోనూ అదే చేశారు.. ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న క‌రోనా వైర‌స్‌ను త‌న పాట‌తోని భ‌య‌పెడుతున్నాడు ఈయ‌న‌. అది ఒక పురుగు..  క‌నిపించ‌ని పురుగు.. క‌రోనా ఓ పురుగు.. నీ బ‌తుకుకి  ఒక‌ చిరుగు.. అయినా చివ‌రికి మంచే జ‌రుగు.. న‌లిపేద్దామంటే అంత సైజు లేదు దానికి..  ప‌చ్చ‌డి చేద్దామంటే కండ‌లేదు దానికి.. అదే దాని బ‌లం... అదే దాని ద‌మ్ము.. అంటున్నాడు.  ఎప్పుడూ వి వాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో వార్త‌ల్లో నిలిచే రామ్‌గోపాల్ వ‌ర్మ ఈసారి ఓ సామాజిక బాధ్య‌త‌ను భుజానికెత్తుకున్నారు. అదేమంటే  ప్ర‌పంచా న్ని వ‌ణికిస్తున్న క రోనా మహమ్మారిపై ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించేందుకు వ‌ర్మ ఓపాట‌ను ర‌చించారు. పాట‌లో తాను స్వ‌యంగా న‌టించి, పాడారు.  ఇప్ప‌టికే కరోనా పేరు మీద అనేక వివాదాస్పద ట్వీట్లు చేసిన వర్మ తాజాగా `కనిపించని పురుగు` పేరుతో ఈ పాటను స్వయంగా రాసి, పాడడం విశేషం.

ఈ రోజు (బుధవారం) సాయంత్రం 5.30 గంటలకు పూర్తి పాటను విడుదల చేశాడు. క‌రోనా వైర‌స్‌ను ఓ పురుగుతో పోలుస్తూ వ‌ర్మ విభిన్నంగా ఈ పాట‌ను ర‌చించారు. శాండి అడ్డంకి సంగీతం అందించిన ఈ పాట‌ను వ‌ర్మ ట్విట‌ర్ ద్వారా పంచుకున్నారు. ఇది కరోనా వైరస్ పై నేనే రాసి, పాడిన `కనిపించని పురుగు` అనే పాట ... చెవులకి మాస్క్ తొడుక్కొని వినండి అంటూ  ట్వీట్ చేశాడు.  ఈ పాట‌తో వ‌ర్మ మ‌రోసారి త‌న మార్క్‌ను ప్రేక్ష‌కుల‌కు రుచి చూపారు. లాక్ డౌన్ విధించింది ప్ర‌జ‌ల ర‌క్ష‌ణ కోస‌మ‌ని, ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని వ‌ర్మ ఈ పాట ద్వారా సందేశం ఇచ్చారు. క‌రోనా క‌ట్ట‌డికి నాలుగు ఆయుధాలు ఏంటంటే... చేతులు క‌డుక్కో.. మాస్క్ తొడుక్కో... దూరం పాటించు.. గుమ్మం దాటొద్దు అని ప్ర‌జ‌ల్లో అవ‌గాహన క‌ల్పించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: