ప్రస్తుతం కరోనా మహమ్మారి తో ప్రపంచంలోని దేశాలన్నీ కూడా ఎంతో వణికిపోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ వ్యాధిని మరింతగా వ్యాప్తి చెందకుండా చేసేందుకు ఇప్పటికే మన దేశంతో పాటు పలు ఇతర దేశాలు సైతం కొన్ని వారాల పాటు లాకౌట్ ప్రకటించిన విషయం తెలిసిందే. పూర్తిగా సామజిక దూరం పాటించడంతో పాటు, ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కరూ కూడా దాదాపుగా ఇరవై సెకండ్ల పాటు తమ చేతులను శుభ్రం చేసుకుని, అలానే తమ ఇళ్లను, పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచాలని ప్రజా ప్రతినిధులు, డాక్టర్లు, ప్రముఖులు కోరుతున్నారు. 

 

అయితే ఈ లాకౌట్ చాలావరకు మన దేశంలోనే బాగానే అమలు అవుతున్నప్పటికే, అక్కడక్కడా కొందరు మాత్రం దానిని పెద్దగా సీరియస్ గా తీసుకోకుండా, ప్రతి చిన్న విషయానికి అవసరం ఉన్నా లేకున్నా బయటకు వస్తున్నారని, అది అత్యంత ప్రమాదకరమని ప్రధాని నరేంద్రమోడీ సహా అందరూ ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక మరోవైపు ఈ మహమ్మారి పట్ల ప్రజలను చైతన్యవంతులను చేసి, దానిపై అవగాహన కల్పించేలా ఎప్పటికప్పుడు పలువురు తారలు తమ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా వీడియో బైట్స్ అందిస్తున్నారు. 

 

ఇక నేడు మంచు వారబ్బాయి విష్ణు, కరోనా జాగ్రత్తలపై ఒక వీడియో బైట్ ని పోస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో తమ కుటుంబంలోని వారందరూ కూడా పూర్తిగా ఇళ్ళకే పరిమితం అయ్యారని, ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తుంటే చిన్న పిల్లలు, వృద్ధులు మరింతగా జాగ్రత్త వహించాలని, లేకుంటే ఈ వ్యాధి అటువంటి వారిని కబళించి వేస్తుందని, కాబట్టి అవసరం ఉన్నమేరకు ఇంటికి ఒక్కరు మాత్రమే బయటకు వెళ్ళండి అని, ఆపై పూర్తి జాగ్రత్తలు కూడా తీసుకొమ్మని విష్ణు తన వీడియోలో తెల్పడం జరిగింది. కాగా విష్ణు పోస్ట్ చేసిన ఆ వీడియో ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతోంది....!!

మరింత సమాచారం తెలుసుకోండి: