తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మళయాళం సినిమా ఇండస్ట్రీలలో .. ఒక భాషలో సూపర్ హిట్టయిన సినిమాని మరో భాషలో రీమేక్ చేయడం ఇప్పుడు కొత్తగా వస్తున్నదేమీ కాదు. ఎన్.టి.ఆర్, ఏ.ఎన్.ఆర్ కాలం నుండి ఉన్నదే. అయితే వాటిలో అన్నీ సినిమాలు హిట్టవ్వవు. అలాగే అన్నీ సినిమాలు ఫ్లావవ్వవు. ఇక ఇప్పుడు ఒక భాషలో హిట్ అయిన సినిమాని ఇంకో భాషలో తీయాలన్నది కూడా పెద్ద రిస్కే. అందుకు కారణం నెట్ ఫ్లిక్స్, అమోజాన్ లలో నెల తిరగకుండానే ఆ సినిమాని జనాలు చూసేస్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు పెరిగిన రేట్లని దృష్ఠిలో ఉంచుకొని సినిమా మరీ బ్లాక్ బస్టర్ అయితే తప్ప జనాలు థియోటర్స్ కి రాని పరిస్థితి.

 

అయినా మేకర్స్ ధైర్యం చేసి సినిమాని రీమేక్ చేస్తుస్తుండటం గొప్ప విషయం. ఇక మన టాలీవుడ్ లో ఇప్పుడు కొన్ని సినిమాలు తమిళం, హిందీ, మళయాళం తో పాటు కొరియన్ లాంగ్వేజ్ నుండి రీమేక్ చేస్తున్నారు. అలా 2020 లో కొన్ని చిత్రాలు రీమేక్ అవుతున్నాయి. ఈ నేపత్య్హంలో టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ లో బిగ్ బి అమితాబ్ బచ్చన్ నటించగా మంచి సక్సస్ ని సాధించింది. అంతేకాదు ఇదే సినిమాని కోలీవుడ్ లో అజిత్ తో రీమేక్ చేయగా అక్కడ కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడిదే ఈ సినిమాని రెండేళ్ళ తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న పవన్ కళ్యాణ్ తో దిల్ రాజు రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాకి బాలీవుడ్ నిర్మాతా బోనీ కపూర్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

 

ఇక స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు కూడా తమిళ సూపర్ హిట్ మూవీ అసురన్ ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. కోలీవుడ్ లో ధనుష్ నటించిన ఈ మూవీ 100 కోట్ల వసూళ్ళని సాధించి ధనుష్ కెరీర్ లో గొప్ప సినిమాగా నిలిచింది. దాంతో ఈ సినిమాని నిర్మాత సురేష్ బాబు రైట్స్ కొన్నారు. కొన్నప్పుడు అందరు కాస్త అనుమానం వ్యక్తం చేశారు. ఈ సినిమా మన తెలుగు ఆడియన్స్ కి ఎక్కుతుందా అసలు వర్కూట్ అవుతుందా అని. కాని నారప్ప టైటిల్ వెంకటేష్ గెటప్ ని ఎప్పుడైతే రివీల్ చేశారో అప్పుడే ఈ సినిమా మీద భారీగా అంచనాలు మొదలైపోయాయి. 

 

ఇలాగే ఇప్పుడు టాలీవుడ్ లో మరికొన్ని సినిమాలు ఈ సంవత్సరం రీమేక్ చేస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్ తో మంచి హిట్ అందుకున్న రాం పోతినేని తో కిషోర్ తిరుమల రెడ్ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకి మూలం తమిళ హిట్ సినిమా తడం. అలాగే సుమంత్ హీరోగా ప్రదీప్ కృష్ణమూర్తి తెరకెక్కిస్తున్న కపటదారి సినిమాకి కన్నడ సినిమా కవలుదారి ఆధారం. ఇక యంగ్ హీరో నితిన్ కూడా బాలీవుడ్ హిట్ సినిమా అంధాదున్ ని తెలుగులో సొంత బ్యానర్ లో రీమేక్ చేస్తున్నాడు. అయితే వీటిలో వకీల్ సాబ్ పక్కా సూపర్ హిట్ అన్న టాక్ ఉంది. అలాగే అసురన్ రీమేక్ నారప్ప కూడా బ్లాక్ బస్టర్ హిట్ అని చిత్ర యూనిట్ ధీమాగా ఉంది. మిగిలిన సినిమాలు వాటి ఫస్ట్ లేదా టీజర్స్ వస్తే గాని తెలీదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: