టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, నటప్రపూర్ణ మోహన్ బాబు ఇద్దరూ కూడా బయట ఏ ఫంక్షన్ లో కలిసినప్పటికీ కూడా వారిద్దరి మధ్య మంచి సరదా సంభాషణ జరుగుతూ ఉంటుంది. కొందరు ప్రేక్షకులు వారిద్దరినీ టామ్ అండ్ జెర్రీ అని సరదాగా పిలుస్తూ ఉంటారు. నటనలోనూ, పేరులోనూ వీరిద్దరూ ఎవరికి వారే సాటి. ఇక ఎటువంటి పాత్రలో అయినా ఒదిగిపోయి నటించడంతో అటు మెగాస్టార్ తో పాటు ఇటు మోహన్ బాబు ఇద్దరూ కూడా మంచి దిట్టలే అని చెప్పాలి. 

 

ఇక ఇటీవల జరిగిన ఒక వేడుకలో మోహన్ బాబు, మెగాస్టార్ తో తనకు ఉన్న అనుబంధాన్ని, వారిద్దరి మధ్య ఎటువంటి కల్మషం లేని స్నేహాన్ని గురించి మాట్లాడుతుండగా, ప్రక్కనే కూర్చున్న మెగాస్టార్ చిరంజీవి, వెంటనే లేచి నిలబడి మోహన్ బాబు ని గట్టిగా కౌగిలించుకుని ఆయన బుగ్గపై సరదాగా ముద్దాడడం జరిగింది. కాగా ఆ సన్నివేశం దాదాపుగా కొద్దిరోజుల పాటు పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో  ఎంతో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ తో పూర్తిగా ఇంటికి పరిమితం అయిన పలువురు ప్రజలు, సినిమా నటులపై సరదాగా పలు మెమేలు అలానే వీడియో ల వంటివి క్రియేట్ చేస్తూ వాటిని తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేస్తున్నారు. 

 

కాగా ఇటీవల మోహన్ బాబు, చిరంజీవి కలిసి మా అసోసియేషన్ మీటింగ్ లో పాల్గొన్న ఒక వీడియో ని తీసుకుని దానికి ఒకప్పటి సూపర్ హిట్ మూవీ ప్రేమదేశం సినిమాలో ఫ్రెండ్ షిప్ ని ప్రతిబింబిస్తూ కంపోజ్ చేయబడిన ముస్తఫా ముస్తఫా సాంగ్ ని,మోహన్ బాబు, చిరంజీవి వీడియోకి బ్యాక్ గ్రౌండ్ సాంగ్ గా అటాచ్ చేయడం జరిగింది. అయితే ఆ వీడియో బయటికొచ్చిన కాసేపటికే పలువురు నెటిజన్లు దానిని పలు విధాలుగా షేర్స్, లైక్స్ తో విపరీతంగా వైరల్ చేస్తూ సంచలనం చేస్తున్నారు....!!

 

మరింత సమాచారం తెలుసుకోండి: