ఏంటి? రామ్ గోపాల్ వర్మకు కరోనా వైరస్ ఆ? నిజామా? అని షాక్ అవుతున్నారా? అవ్వకండి.. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ ఎంత పెద్ద తిక్కోడు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఎప్పుడు ఎం మాట్లాడుతాడో.. ఎప్పుడు ఎవరితో తిట్టించుకుంటాడో.. ఎప్పుడు ఏ రాజీకీయ నాయకుడుతో గొడవ పడుతాడో చెప్పలేని పరిస్థితి.   

 

అలాంటి వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ఇన్నాళ్లు రాజీకీయనాయకులపైనా.. ప్రజలపైన.. రౌడీలపైన మాత్రమే జోకులు చేస్తున్నాడు అని అనుకున్నాం.. కానీ రామ్ గోపాల్ వర్మకు అంతకు మించి వెర్రి అని ఈరోజే అర్ధం అయ్యింది. ఇంకా పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఇప్పటికే భారత్ అంత కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఎక్కువ అవుతున్నాయి అని ఆందోళనలో ఉంది. 

 

అలాంటి ఈ సమయంలో ఈ కరోనాపై జోకులు వేస్తే ఏమైనా మర్యాదనా ? ప్రపంచాన్ని చిగురుటాకులా వణికిస్తున్న ఈ కరోనా వైరస్ పై ఈ రామ్ గోపాల్ వర్మకు జోకులు అవసరమా? నిన్న ట్విట్టర్ వేదికగా అతనికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది అని డాక్టర్ చెప్పినట్టు ట్విట్ చేశాడు. దీంతో అభిమానులు అంత ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. 

 

అయితే కొద్దీ సమయానికి మళ్లీ ఓ ట్విట్ చేస్తూ అతనికి కరోనా వైరస్ లేదని డాక్టర్ చెప్పినట్టు.. డాక్టర్ అతన్ని ఏప్రిల్ ఫూల్ చేసినట్టు చెప్పాడు.. దీంతో నెటిజన్లు అంత ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏ విషయంలో జోకులు వెయ్యాలో కూడా తెలియని స్థితిలో రామ్ గోపాల్ వర్మ ఉన్నాడు అంటూ ఫైర్ అయ్యారు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: