ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సాహో సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను కూడా పలకరించిన హాట్ బ్యూటీ జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌. ఇటీవల ఈ భామ రాపర్‌ బాద్‌ షాతో కలిసి జెండా ఫూల్‌ అనే ఆల్బమ్‌ ను రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ ఆల్బమ్ లో యూట్యూబ్‌ లో టాప్‌ లో ట్రెండ్ అవుతోంది. సూపర్‌ హిట్ అయిన ఈ ఆల్బమ్‌ పై అదే స్థాయిలో విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఆల్బమ్ లో ప్రముఖ ప్రజా గాయకుడు రతన్‌ కహర్‌ రాసిన పాట లిరిక్స్ ను వాడుకొని ఆయనకు క్రెడిట్స్‌ ఇవ్వకపోవటం పై నెటిజెన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

అయితే ఈ విషయంపై బాద్‌ షా స్పందించాడు. తనకు ఎవరి కళను, పేరును దోచుకునే ఉద్దేశం లేదన్నాడు. అయితే తాను ఆ లిరిక్స్ ను పాట కోసం వాడుకోవాలనుకున్న సమయంలో దాని రచయిత ఎవరన్న విషయం తనకు తెలియదని, అందుకే క్రెడిట్ బెంగాలీ ఫోక్ అని వేశానని వెల్లడించాడు. రచయిత పేరు తెలుసుకోవాడానికి చాలా ప్రయత్నించినా కుదరలేదన్నాడు బాద్‌ షా. పాట రిలీజ్ అయిన తరువాత కొంత మంది నెటిజెన్లు తనకు రతన్‌ కు సంబంధించిన డాక్యుమెంటరీ ట్యాగ్ చేశారని అప్పుడే ఆ లిరిక్స్‌ అతనివే అని తెలిసిందన్నారు.

 

అయితే ప్రస్తుతం రికార్డ్స్ లో అతనికి క్రెడిట్ ఇవ్వటం సాధ్యం కాదు. కానీ ఆయనకు ఆర్థికంగా సాయం చేస్తాం. ఆయన కళకు తగిన మొత్తాన్ని ఆయనకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించాడు బాద్‌ షా. అంతేకాదు రతన్‌ గొప్ప కళాకరుడు అని కీర్తించిన బాద్‌ షా, ఆయన కంపోజిషన్స్‌ ఎంతో బాగుంటాయన్నాడు రాపర్ బాద్‌ షా.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Please read

A post shared by BADSHAH (@badboyshah) on

మరింత సమాచారం తెలుసుకోండి: