గత నెలలో మన దేశంలో మూత బడ్డ ధియేటర్లు ఎప్పుడు ఓపెన్ అవుతాయో ఎవరికీ తెలియని అయోమయ పరిస్థితి. వాస్తవానికి ప్రస్తుతం కొనసాగుతున్న లాక్ డౌన్ ఇంకా ఎన్ని వారాలు కొనసాగుతుందో ఎవరి అంచనాలకు రావడం లేదు. దేశంలో కరోనా కేసులు రోజురోజుకు ఉదృతం అవుతున్న పరిస్థితులలో మన ఇండియాకు మంచి ఆదాయాన్ని తెచ్చి పెట్టె టూరిజమ్ ఇండస్ట్రీ ఫిలిం ఇండస్ట్రీలు అసలు కోలుకునే పరిస్థితి వస్తుందా అన్న సందేహాలు వస్తున్నాయి. 


అయితే కరోనా సమస్య నుండి చైనా తేరుకోవడంతో అక్కడ ఫ్యాక్టరీలు తిరిగి ఓపెన్ చేయడమే కాకుండా ప్రపంచంలోనే అత్యధిక ధియేటర్లు ఉన్న చైనా లోని ధియేటర్లను కూడ ఓపెన్ చేసారు. అయితే అక్కడ ప్రజలకు ఇంకా కరోనా భయం పోకపోవడంతో వారిలోని భయాన్ని పోగొట్టడానికి ధియేటర్లలోని సీట్ల సంఖ్యను తగ్గించి మనిషి మనిషికి మధ్య మూడు సీట్లు గ్యాప్ ఉండేలా సీటింగ్ సిష్టమ్ ను మార్చినట్లు తెలుస్తోంది. 


ఇప్పుడు ఇదే పద్ధతి మన ఇండియాలోని సినిమా ధియేటర్లు కూడ అనుసరించాలి అంటూ కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు పెడితే అసలు ఇప్పట్లో సినిమా ధియేటర్లు తెరుచుకునే పరిస్థితులు ఉన్నాయా అంటూ కొందరు సందేహాలు వ్యక్తపరుస్తున్నారు. ధియేటర్లకు సంబంధించి ఇలా సీట్లు తగ్గిస్తే ఇప్పటికే నష్టాల ఊబిలో కూరుకుపోయి ధియేటర్లు నడుపుకునేకన్నా ధియేటర్లను ఫంక్షన్ హాల్స్ గా లేదంటే గోడౌన్ లుగా మార్చుకోవడం ఉత్తమం అన్న పరిస్థితి ఏర్పడవచ్చు అని అంటున్నారు.


వాస్తవానికి ఇది అంతా కరోనా సమస్య పూర్తిగా కట్టడి అయ్యాక ఎదురయ్యే పరిస్థితులు. అయితే ఇండియాలో కరోనా ఎప్పటికి కంట్రోల్ కు వస్తుందో నిపుణులకు కూడ తెలియని పరిస్థితులలో ఈ విషయాలు అన్నీ కేవలం ఊహాగానాలు మాత్రమే అని అంటున్నారు. అయితే కరోనా కంట్రోల్ లోకి వచ్చిన తరువాత ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అనేక మార్పులు వస్తాయి అన్న విషయం మాత్రం యదార్థం..

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: