సంచలనాత్మక కామెంట్స్ చేస్తూ నిరంతరం వివాదాలు తనకు తాను సృష్టించుకునే వర్మ కరోనా పై కనిపించని పురుగు అని పాట పాడి జనం పై దాడి చేయడంతో జనం భయపడిపోయి ఆ పాట నుండి తప్పించుకోవడానికి తమ చెవులకు కూడ మాస్క్ లు పెట్టుకోవాలని ప్రయత్నించారు. ‘అది కరోనా అనే ఒక పురుగు.. నలిపేద్దాం అంటే అంత సైజు లేదు దానికి.. పచ్చడి చేద్దాం అంటే కండ లేదు దానికి దాని బలం.. అదే దాని దమ్ము. కంటికి కనిపిస్తే దానమ్మ దాన్ని కత్తితో పొడవచ్చు.. ఉనికిని చూపిస్తే కింద బాంబు పెట్టి పేల్చొచ్చు.. బట్ ఇట్ ఈజ్ జస్ట్ పురుగు’ అంటూ రకరకాల పిచ్చి పదాలను జోడించి వర్మ కరోనా ను కూడ భయపెట్టడానికి ప్రయత్నించాడు. 


దీనితో ఈ పాట విన్న చాలామంది జనం ఈ గృహ నిర్భంధం మధ్య తమకు ఈ టార్చర్ ఏమిటి అంటూ కరోనా వస్తే వైద్యం చేయించుకుని బాగుపడవచ్చు కానీ నీపాట విని జనం చచ్చిపోయేలా ఉన్నారు అంటూ జనం వర్మ పై విరుచుకు పడ్డారు. దీనితో నిరాశ పడ్డ వర్మ నిన్నరాత్రి బాగా పొద్దుపోయాక ‘ఇప్పుడే మా డాక్టర్ నన్ను పరీక్షించి కరోనా పాజిటివ్ అని చెప్పారు’ అంటూ మరొక షాకింగ్ న్యూస్ బయటపెట్టాడు. 

 

అయితే జనం మాత్రం ఏమాత్రం ఖంగారు పడిపోకుండా వర్మ లాంటి వ్యక్తులకు అలాంటి వ్యాధులు అంత సులువుగా రావని చెపుతూ తమకు అంత అదృష్టం లేదు అంటూ కామెంట్స్ చేసారు. దీనితో వర్మ రంగంలోకి దిగి ‘సారీ మిమ్మల్ని నిరాశ పరిచినందుకు క్షమించండి.. ఇప్పుడే ఆడాక్టర్ ఇది ఏప్రిల్ పూల్ జోక్ అని చెప్పాడు.. అది అతని తప్పు నాది కాదు’ అంటూ ట్విస్ట్ ఇచ్చాడు. 

 

దీనితో వర్మ అభిమానులు కూడ తీవ్ర అసహనానికి లోనవుతూ జనం అంతా కరోనా సమస్యతో అట్టుడికిపోతుంటే జనంతో ఇలాంటి ఆటలు ఏమిటి అంటూ వర్మకు రివర్స్ క్లాస్ పీకారు. ఏమైనా కరోనా భయాల మధ్య జనంకు వినోదం పంచాలి అని వర్మ చేసిన ప్రయత్నాలు ఘోరంగా విఫలం అయ్యాయి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: