పూరి జగన్నాథ్ వ్యవహార శైలి చాల విభిన్నంగా ఉంటుంది. అతడి మాటలలో చేతలలో అతడి గురువు రామ్ గోపాల వర్మ ప్రభావం చాల కష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం కరోనా గురించి సెలెబ్రెటీలు అంతా రకరకాల సూచనలు చేస్తూ ఈ గండం నుండి ఎలా బయటపడాలో అందరికీ సూచనలు ఇస్తున్నారు. 


అయితే ఈ గండం నుంచి బయటపడాలి అంటే పూరీ జగన్నాథ్ మాత్రం మనదేశంలో కొంతకాలం వివాహాలను నిషేధించాలి అని అంటున్నాడు. ఈ భూమికి ప‌ట్టిన వైర‌స్ మ‌నిషే అంటూ  జ‌నాభా ఎక్క‌డికక్క‌డ పెరుగుతూ పోతోంద‌ని మ‌నిషి త‌ప్ప మ‌రో జీవికి ఈ భూమ్మీద చోటు లేకుండా చేస్తున్నామ‌ని పెళ్లిళ్లు చేసుకోవ‌డం ఆపేసి జ‌నాభా త‌గ్గించుకోవాల‌ని పూరి పిలుపు ఇచ్చాడు. 


ప్రపంచంలో మనుషుల సంఖ్య పెరిగిపోతూ ఉండటంతో జంతువులకు ఈ భూమి మీద చోటు లేకుండా పోతోందని అదేవిధంగా చెట్లకు కూడ చోటు లేకుండా పోయిందని జనం అంతా పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లలను కనడం పై దృష్టి పెట్టడంతో స్థానం లేకుండా కోల్పోయిన జంతువులు ప్రకృతి మనుషుల పై పగ పట్టాయని అందువల్లనే కరోనా వచ్చింది అంటూ పూరి కామెంట్ చేసాడు. ప్ర‌పంచ దేశాల‌న్నీ జ‌నాభాని త‌గ్గించుకోవ‌డానికి ప్ర‌య‌త్నించాల‌ని సంతానోత్ప‌త్తి ఆపేయాల‌ని లేదంటే జంతువులన్నీ అంత‌రించిపోయే ప్ర‌మాదం ఉంది అంటూ పూరీ హెచ్చరికలు ఇస్తున్నాడు. 


అంతేకాదు క‌రోనా వైర‌స్ నుంచి బ‌య‌ట‌ప‌డ‌గానే మ‌రో రెండేళ్ల పాటు ఎక్కువ క‌ష్ట‌ప‌డి అందరు ప‌నిచేయాలని లేకుంటే జీవించడం కష్టం అంటూ పూరీ కొత్త వేదాంతాన్ని ఈ కరోనా సమస్యల నేపద్యంలో అందరికీ అర్ధం అయ్యేలా ఉపదేసిస్తున్నాడు. ప్రస్తుతం కరోనా వైరస్ ఎలా కంట్రోల్ చేయాలో తెలియక ప్రపంచం అంతా తలలు పట్టుకుంటున్నా పరిస్థితులలో పూరి సిద్ధాంతాన్ని అనుసరిస్తూ కొన్ని దేశాలు ముఖ్యంగా చైనా ఇండియా లాంటి ఎక్కువ జనాభా గల దేశాలు పెళ్ళిళ్ళను రానున్న రోజులలో నిషేదిస్తాయేమో చూడాలి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: