ఇప్పటివరకు అందరితో ఒక ఆట ఆడుకున్న రామ్ గోపాల్ వర్మతో ఒక ఆట ఆడుకోవడానికి   పంతంతో రగిలిపోతున్న జొన్నవిత్తుల రామ లింగేశ్వర రావు తన పగకు శ్రీరామనవమిని అవకాశంగా తీసుకున్నారు. రామ్ గోపాల్ వర్మ జీవితంలోని చీకటి కోణాలను బయటపడతాను అంటూ ఇప్పటికే ప్రకటన ఇచ్చిన జొన్న విత్తుల వర్మ పై తీస్తున్న బయోపిక్ కు లైన్ క్లియర్ చేసాడు.  


టారస్ సినికార్ప్ మాగ్నస్ సినీ ప్రైమ్ పతాకం పై బాల కుటుంబరావు పొన్నూరి ఈ సినిమాను నిర్మించబోతున్నారు. ఈరోజు ‘ఆర్జీవీ' చిత్ర టైటిల్ లోగో విడుదల చేయడమే కాకుండా సినిమాలోని  నటీనటులు సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో ప్రకటిస్తానని శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు కీలక ప్రకటన చేసారు. 


'తా చెడ్డకోతి వనమెల్లా చెరిచినట్లు' తన పిచ్చి ఇజమ్ తో యువతను పెడత్రోవ పట్టిస్తున్న ఒక వ్యక్తి ఫిలాసఫి మీద రామబాణమే ఈ సినిమా అని జొన్న విత్తుల అంటున్నారు. ఒక మంచి ఉద్దేశ్యంతో తీస్తున్న మూవీ కాబట్టి "శ్రీరామనవమి" పర్వదినాన ఈ చిత్ర టైటిల్ లోగో విడుదల చెయడం జరిగిందని చెపుతూ కరోనా ప్రభావం పూర్తిగా తగ్గిన వెంటనే ఈ మూవీ చిత్రీకరణ ప్రారంభిస్తామని జొన్న విత్తుల క్లారిటీ ఇచ్చారు.


సామాజిక బాధ్యత లేని ఒక కుహనా మేధావి ఐడియాలజీ సమాజాన్ని ఎలా కలుషితం చేస్తుందో  అనే విషయాన్ని ఈ మూవీలో తానూ వివరంగా చూపించబోతున్న విషయాలను వివరించారు. దీనితో ఇప్పటివరకు దేముళ్ళ దగ్గర నుండి సెలిబ్రిటీల వరకు అందరితోను ఒక ఆట ఆడుకున్న వర్మను ఆతాడించే రికార్డు జొన్న విత్తుల సొంతం కాబోతోంది. ప్రస్తుతం కరోనా పరిస్థితుల వల్ల స్తబ్దంగా ఉన్న టాలీవుడ్ ఇండస్ట్రీకి జొన్న విత్తుల ప్రకటన కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. మరి జొన్న విత్తుల పరకన పై వర్మ నుండి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: