కరోనా ప్రభావం తో ప్రపంచమంతా స్థంబించిపోయింది. ప్రతీ రంగం పైనా వైరస్‌ ప్రభావం తీవ్రంగా పడింది. దాదాపు అన్ని రంగాలు ఈ మహమ్మారి ప్రభావంతో కుదేళయిపోయాయి. వైరస్‌ క్షణ క్షణానికి విస్తరిస్తుండటంతో ప్రజలు గడప దాటడానికే వణికిపోతున్నారు. ప్రభుత్వాలు కూడా లాక్ డౌన్ విధించి అందరినీ ఇంట్లోనే ఉండాలని కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో థియేటర్లు కూడా మూతపడ్డాయి.

 

అయితే వైరస్‌ పుట్టిన చైనాలో ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయి. ముఖ్యంగా వైరస్ భీతావహ పరిస్థితులు సృష్టించిన వుహాన్‌ లోనూ అన్ని తెరచుకుంటున్నాయి. తాజాగా చైనాలోని సినిమా థియేటర్లు కూడా తెరచుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే థియేటర్లలో పలు ఆంక్షలు విధించి ప్రజలను అనుమతిస్తున్నారట. గతంలో ఉన్నట్టుగా వందల సంఖ్యలో ప్రజలను అనుమతించవద్దని ప్రభుత్వం నిబంధనలు విధించింది.

 

అంతేకాదు థియేటర్లో ప్రజలను అనుమతించటంపై పలు సూచనలు కూడా చేసింది చైనా ప్రభుత్వం. గతంలోలా ఒకరి పక్కన ఒకరు కాకుండా ఒకరి తరువాత మూడు సీట్లు వదిలిపెట్టి, మరో సీట్లో మరొకరు కూర్చునేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. దీంతో పాటు ప్రతీ షో తరువాత థియేటర్ మొత్తాన్ని శానిటైజ్ చేయాలి. అలాగే గతంలో నిర్వహించినట్టుగా కంటిన్యూస్‌ షోస్ కాకుండా లిమిటెడ్‌ గా షోస్ వేసేలా సూచనలు చేసింది చైనా ప్రభుత్వం.

 

అయితే చైనా థియేటర్లు ఓపెన్ చేసినా ప్రజలు మాత్రం ఇప్పట్లో థియేటర్లలో అడుపెట్టే అవకాశం అయితే కనిపించటం లేదు. చావు భయాన్ని దగ్గర గా చూసిన ప్రజలు ఇప్పుడే వినోదం కోసం సాహసం చేసే పరిస్థితి కనిపించటం లేదు. అయితే చైనా తీసుకున్న చర్యలతో మన దేశంలో కూడా లాంటి నిబంధనల తో థియేటర్లు ఓపెన్ చేస్తారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: