ప్రపంచవ్యాప్తంగా సూపర్ స్టార్ రజనీకాంత్ కి ఎంత ఫాలోయింగ్ ఉందో పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. బాషా, అన్నామలై, ముత్తు, అరుణాచలం, నరసింహ, రోబో ఇలా ప్రతి సినిమా ప్రేక్షకులకు వినోదాన్ని పంచిపెట్టింది. ఇండియన్ సినీ చరిత్రలో స్టైల్ కి పెట్టింది పేరు సూపర్ స్టార్ రజినీకాంత్. ఆయన నడక, మాట, చూపు, డాన్స్, ఫైట్స్, యాక్షన్ ఏది చేసినా స్టైల్ గానే ఉంటాయి. సూపర్ స్టార్ తలైవర్.. అప్పటి చిరంజీవి, కమల్ దగ్గర నుండి నేటి యంగ్ హీరోలకు సైతం పోటీగా నిలుస్తున్నాడు. తలైవర్ సినిమా అంటేనే అభిమానులకు పండగ. స్టైలు స్టైలురా నీది సూపర్ స్టైలురా.. అని కోట్లాది అభిమానులతో అనిపించుకుని నేటికీ హీరోగా థియేటర్లలో దుమ్ము రేపుతున్నది రజిని ఒక్కడే. ఇటీవలే 'దర్బార్' సినిమా విజయంతో ఊపులో ఉన్న రజిని ప్రస్తుతం శివ దర్శకత్వంలో తన 168వ సినిమాను పూర్తిచేస్తున్నాడు. ఆ సినిమా షూటింగులో ఉండగానే తన తదుపరి సినిమాలను చకచకా ఓకే చేస్తున్నాడు.

 

ఇక రజిని 169వ సినిమాను ఖైదీ, మాస్టర్ సినిమాల డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ రూపొందిస్తారని, అదీగాక కమల్ హాసన్ ఈ సినిమాను నిర్మిస్తాడన్నది విశేషం. ప్రముఖ కొరియోగ్రాఫర్ నుండి డైరెక్టర్ గా మారిన లారెన్స్, రజిని 170వ సినిమాను తెరకెక్కిస్తాడని ఇండస్ట్రీ అంతా కోడై కూస్తుంది. ఆల్రెడీ తలైవర్ రజినీకి లారెన్స్ వీరాభిమాని. అప్పుడప్పుడు కలిసి చిన్న స్టోరీ లైన్ వినిపించాడట. ఆ స్టోరీ లైన్ నచ్చడంతో రజిని కూడా పచ్చ జెండా ఊపినట్లు తెలుస్తుంది. అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుందని సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్.

 

హీరోయిజంను చూపించడంలో డైరెక్టర్ శివకి ప్రత్యేక శైలి ఉంది. మాస్, క్లాస్ ఎలాంటి ప్రేక్షకుడినైనా మెప్పించే సత్తా ఉన్న దర్శకుడిగా ఇండస్ట్రీలో శివకి మంచి పేరుంది. ఇప్పటికే తలా అజిత్ తో వరుస బ్లాక్ బస్టర్లను రూపొందించి విశేషంగా ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటున్నాడు. అలాంటిది సూపర్ స్టార్ రజినిని ఏ రేంజ్ లో చూపిస్తాడో అని తలైవర్ అభిమానులలో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రజినీకి తోడు మాజీ బ్యూటీలు ఖుష్బూ, మీనాలు నటిస్తుండగా, మహానటి కీర్తిసురేష్ కీలక పాత్రను పోషిస్తుంది. రజినీతో రోబో సినిమాను నిర్మించిన సన్ పిక్చర్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తుండటం విశేషం. సన్ పిక్చర్స్ అంటేనే సినిమా భారీ బడ్జెట్ తో గ్రాండియర్ గా ఉండబోతుందని అర్ధమవుతుంది. మొదటిసారి శివ-రజినిల కాంబినేషన్ లో సినిమా రాబోతుంది. ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో అని సినీ వర్గాలలో ఆసక్తి నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: