క‌రోనా వైర‌స్ ఉన్నాకొద్దీ దిన దిన గండంలా మారింది. రోజు రోజుకి పెరుగుతున్న  నేప‌థ్యంలో టాలీవుడ్ నుంచి కేవ‌లం స్టార్ హీరోలు..  చిన్న హీరోలు సైతం ఈ క‌రోనా బాధితుల‌కు స‌హాయ‌ప‌డ‌టానికి ముందుకు వ‌చ్చారు. డైరెక్ట‌ర్లు.. కొద్ది మంది సాంకేతిక నిపుణులు మాత్రమే విరాళాలిచ్చారు. కోట్లాది రూపాయ‌లు దండుకున్న ఏ స్టార్ హీరోయిన్ తెలుగు ప్ర‌జ‌ల‌కు కానీ వారి స్వ‌స్థ‌లంలో కానీ రూపాయి కూడా సాయం చేయ‌లేదు. దీంతో స‌ద‌రు హీరోయిన్ల పై నెటిజ‌నులు ఇప్ప‌టికే త‌మ‌దైన శైలిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. అయినా స‌ద‌రు భామామ‌ణుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. దీంతో ఇలాంటి హీరోయిన్లను ఎంక‌రేజ్ చేసి అందలం ఎక్కిస్తున్నామా? అంటూ మండిప‌డుతున్నారు. సాయంలో కోట్ల‌లో దండుకునే నాయిక‌లు.. రోజువారీగా ల‌క్ష‌ల్లో అందుకునే క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుల కంటే దర్శ‌కులే బెట‌ర్. దాదాపు స్టార్ డైరెక్ట‌ర్లు అంతా త‌మ‌కు తోచినంత విరాళం ప్ర‌క‌టించి ధాతృత్వాన్ని చాటుకున్నారు.

 

అయితే ఈ లిస్ట్ లో పాన్ ఇండియా డైరెక్ట‌ర్ రాజమౌళి లేక‌పోవ‌డం అంద‌రికీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. దీంతో ప‌లువురు అస‌లు జ‌క్క‌న్న ఎవ‌రికీ ఏ సాయం చేయ‌డా? అంటూ విమ‌ర్శ‌లు స్టార్ట్ చేశారు. అయితే కాస్త డీటెయిల్డ్ గా ప‌రిశీలిస్తే.. రాజ‌మౌళి అండ్ కో గ‌తంలో ఎప్పుడూ కూడా విరాళాలు ఇచ్చిన దాఖ‌లాలు లేవు. ప్ర‌పంచ‌మే త‌ల్ల‌కిందులైపోయినా మాకేంటి? అన్న‌ట్లే ఉంటార‌ని చాలాసార్లు క‌థ‌నాలు వేడెక్కించాయి. ఇక ఇదిలా ఉంటే ఒక‌ప‌క్క క‌రోనాతో టెన్ష‌న్ ప‌డుతుంటే...వీళ్ళ సినిమా ప్ర‌మోష‌న్ వీళ్ళ‌ది అన్న‌రీతిలో ఉంటున్నాడు రాజ‌మౌళి. మ‌రి క‌రోనా కార‌ణంగా జాతీయ విప‌త్తు ప్ర‌క‌టించిన‌ప్పుడు జ‌క్క‌న్న అదే వైఖ‌రితో ఉన్నారా? అంటే.. అలాంటిదేం లేదు అంత‌నిలో కొంచెం మార్పు వ‌చ్చింద‌నే కొంత మంది అంటున్నారు. ఈసారి జ‌క్క‌న్న ఎవ‌రూ ఊహించ‌ని విధంగా ఎలాంటి ప‌బ్లిసిటీ చేసుకోకుండా భారీగానే ఖ‌ర్చు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. కరోనా ట్రీట్ మెంట్ చేసే డాక్ట‌ర్ల‌కు.. న‌ర్సుల‌కు అవ‌స‌ర‌మ‌య్యే కిట్లు ఎంత కాస్ట్ లీ అయినా వాటిని కొని అందిస్తున్నాడు.

 

ఇందులో రాజ‌మౌడ్ అండ్ కో మొత్తం జాయిన్ అయిందిట‌. జ‌క్క‌న్న వ్య‌క్తిగ‌తంగాను రోగుల‌కు సేవ చేసే డాక్ట‌ర్ల‌కు అండ‌గా నిలుస్తున్నాడ‌ట‌. రోజూ డాక్ట‌ర్లు ధ‌రించే ప్రొటెక్టివ్ కిట్లు కూడా జ‌క్క‌న్న స్వ‌యంగా స్పాన్స‌ర్ చేస్తున్నాడ‌ట‌. ఇవి ఎంతో ఖ‌రీదైన‌వి అని తెలిసింది. రోజులో ఒక‌సారి మాత్ర‌మే వాటిని వాడ‌తారు. ఆ త‌ర్వాత తీసేయాల్సిందే. మ‌రుస‌టి రోజు మ‌ళ్లీ మ‌రో కొత్త లేయ‌ర్ ని తొడుక్కోవాల్సిందేనట‌. వాట‌న్నింటి ఖ‌ర్చు జ‌క్క‌న్న ఒక్క‌డే భ‌రిస్తున్నాడ‌ట‌. మొత్తానికి జ‌క్క‌న్న సేవ‌కుల‌కే సేవ‌కుడిగా నిలిచిపోయాడ‌న్న‌ది గుర్తుంచుకోవాలి. ఇక రాజ‌మౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ సైతం క‌రోనా మ‌హ‌మ్మారీ దెబ్బ‌కు నిలిచిపోయిన సంగ‌తి తెలిసిందే. లాక్ డౌన్ తొల‌గిస్తేనే షూటింగ్ కి వెళ్లే వీలుంటుంది. కానీ ఇప్ప‌ట్లో ఆ సీన్ క‌నిపించ‌డం లేదు. మ‌రి ఇది షూటింగ్ మొత్తం పూర్త‌యి ఎప్ప‌టికి రిలీజ్ అవుతుందో ఏమో మ‌రి.

మరింత సమాచారం తెలుసుకోండి: