ప్రస్తుతం ప్రపంచం మొత్తాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి వలన అన్ని దేశాల ప్రజలు ప్రభుత్వాలు ఎంతో భయంతో వణికిపోతున్న విషయం తెలిసిందే. ఇక ఆయా దేశాలు ఇప్పటికే పూర్తిగా కొన్ని వారాల పాటు లాకౌట్ ప్రకటించి ప్రజలను తమ తమ ఇళ్లకే పరిమితం చేసి కరోనా వ్యాప్తిని మరింతగా కట్టడి చేసే ప్రయత్నాన్ని మొదలెట్టాయి. అలానే మన దేశాన్ని కూడా ఇప్పటికే 21 రోజుల పాటు పూర్తిగా లాకౌట్ చేస్తున్నట్లు మన ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రకటించడం జరిగింది. ఇక ఈ కరోనా దెబ్బకు పేద, దిగువతరగతి వర్గాల ప్రజలు పనులకు వెళ్లలేక పూర్తిగా ఇళ్లకే పరిమితం అయి కనీసం తిండి కూడా తినలేని పరిస్థితులు ఎదుర్కోవడంతో పలు ప్రభుత్వాలతో పాటు పలువురు ప్రముఖులు కూడా వారికి సాయం అందించేందుకు ముందుకు రావడం జరుగుతోంది.

 

ప్రజలు అందరూ కూడా మరికొద్దిరోజులపాటు పూర్తిగా సామజిక దూరాన్ని తూచా తప్పకుండా పాటిస్తే రాబోయే అతి కొద్దిరోజుల్లోనే ఈ మహమ్మారిని మన దేశం నుండి తరిమి కొట్టవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా దగ్గేటప్పుడు, తుమ్మేటపుడు చేతిని గట్టిగా అడ్డం పెట్టుకుని టిష్యు  లేదా కర్చీఫ్ వాడాలని సూచిస్తున్నారు. ఇక మరీ ముఖ్యంగా చేతులను 20సెకన్ల పాటు ఎప్పటికప్పుడు శానిటైజర్ తో వాష్ చేసుకుంటే మంచిదని పలువురు డాక్టర్లు సూచిస్తుండడంతో మన దేశంలో ఈ శానిటైజర్ ల వినియోగం ఎక్కువ అయింది. అయితే ఈ శానిటైజర్ల వాడకం వలన కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే పలువురు చెపుతున్నారు, శానిటైజర్ వాడిన సమయంలో ఏ మాత్రం అలసత్వం వహించినా ఎదురయ్యే భయంకర పరిణామాలను గురించి దర్శకుడు పూరి జగన్నాథ్ నేడు ఒక వీడియో పోస్ట్ చేసారు. 

 

ఆ వీడియో గమనిస్తే, అందులో శానిటైజర్ ని ఒక ప్లేట్ లో కొంత తీసుకుని దానిపై అగ్గిపుల్లను అంటించడం జరిగింది. అయితే అగ్గి ఆ శానిటైజర్ కు ఏ మాత్రం అంటుకోలేదు, కానీ అదే శానిటైజర్ వద్దకు టిష్యు లేదా పేపర్ తీసుకుని వచ్చి పెట్టగానే అవి కాలి బూడిదవడం వీడియోలో గమనించవచ్చు. కాబట్టి మన ఇంట్లో ఉండే మహిళలు, చిన్న పిల్లలు ముఖ్యంగా ఈ శానిటైజర్ వాడిన సమయంలో అగ్నికి దూరంగా ఉండాలని, లేదంటే పెను ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పూరి కోరారు. నిజంగా అందరి గుండె బద్దలు చేసే ఈ వీడియో ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతోంది....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: