సమంత ఈ మధ్య వరసగా  చిత్రాలలో చేస్తూ  అధ్బుతమైన అభినయం ప్రదర్శిస్తోంది. ఆమె మంచి పాత్రలను కూడా  ఎంచుకుంటోంది.  ఆమె చేస్తున్న సినిమాలు కూడా బాగానే  హిట్ అవుతున్నాయి. ఆమె పెళ్ళి అయిన తరువాత సెలెక్టివ్ గా నటిస్తూ తన సత్తా చాటుకుంటోంది. ఈ నేపధ్యంలో అద్భుతమైన పాత్రలో ఆమె త్వరలో కనిపించబోతోందిట.

 

ఆ సినిమాను సీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహిస్తున్నారు. బెంగుళూరు కి చెందిన  ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు 'బెంగళూరు నాగరత్నమ్మ' పేరిట సింగీతం తెరకెక్కిస్తున్నారు.  ఈ మూవీలో ఆమె జీవితం మొత్తం ఉంటుంది.

 

ఆమె కర్ణాటక సంగీతం ప్రతిభా పాటవాలను లోకానికి తెలియచేసిన భారతీయ ఆణిముత్యంగా  ఉన్నారు. ఆమె జీవిత చరిత్రను తీయాలని సింగీతానికి తలపునకు వచ్చింది. వచ్చింది లగాయితూ ఆయన సమంత కోసమే ప్రయత్నం చేశారని టాక్. ఈ మూవీ చేయడానికి సమంత అంగీకరించడంతో సింగీతం మూవీకి ఒక్కసారిగా హైప్ వచ్చింది.

 

ఇక ఈ మూవీని తొందరలోనే సెట్స్ మీదకు తీసుకెళ్ళాలని సింగీతం ఆలోచన  చేస్తున్నారు. సింగీతం వయసు ఇపుడు  87 సంవత్స‌రాలు. ఆయన ఈ ఏజ్ లో  సినిమా తీయడం ఒక ప్రత్యకత అయితే అది కూడా ఒక ప్రముఖ సంగీత కళాకారిణి జీవితాన్ని తీయడం మరో ఎత్తు. ఇక ఈ సినిమాలో నాగరత్నమ్మ పాత్ర సమంత పోషించడం మరో ఎత్తు.

 

ఇక సింగీతం విషయానికి వస్తే ఆయన వెల్కం ఒబామా అని మూవీ ఆరేళ్ళ క్రితం తీశారు. ఆ తరువాత మళ్ళీ మెగా ఫోన్ అసలు పట్టలేదు. ఇపుడు చూస్తే ఆయన ఈ ఏజ్ లో ఇలాంటి సబ్జెక్ట్ ఎంచుకోవడం కాస్తా ఆసక్తిగానే ఉంది. మొత్తానికి ఈ వయసులో కూడా సినిమాలు తీసి హిట్ కొడితే సింగీతం వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసినట్లే మరి. చూడాలి. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: