విజయ్ దేవరకొండ ప్రత్యేకమైన హీరో. ఆయన ఇపుడున్న జనరేషన్ లో కేవలం టాలెంట్ ని నమ్ముకుని వచ్చిన హీరో. వెనక బ్యాక్ గ్రౌండ్ ఏదీ లేకుండానే స్టార్ డంని సంపాదించాడు. ఇక ఆయన సినిమాలు అన్నీ ఒక ఎత్తు. అర్జున్ రెడ్డి మూవీ ఒక ఎత్తు. ఆ మూవీతో ఆయన‌కు రౌడీ హీరో ఇమేజ్ వచ్చేసింది.

 

విజయ్ తన సినిమాలు వెరైటీగా ఉండాలని చూసుకోవడంతో హిట్ల విషయంలో బాగా వెనకబడ్డార‌ని అంటారు. డిఫరెంట్ రోల్స్ అంటూ విజయ్ చేస్తున్న ప్రయోగాలు వరసగా బెడిసికొడుతున్నాయి. మరో హీరో అయితే ఈ స్టార్ ఇమేజ్ ని పది కాలాల పాటు నిలిచేలా స్టోరీస్ సెలెక్ట్ చేసుకునేవారు. విజయ్ తన ఫ్యాన్స్, ఆడియన్స్ ఎలా చూడాలి అనుకుంటున్నారో దానికి భిన్నంగా వెళ్ళడంతో కొంత ఇబ్బంది పడ్డారని అంటున్నారు.

 

ఎన్నో ఆశలు పెట్టుకుని చేసిన మూవీ వరల్డ్  ఫ్యామస్ లవర్ మూవీ డిజాస్టర్ అయింది. ఇపుడు విజయ్ పూరీ జగన్నాధ్ డైరెక్షన్లో ఫైటర్ మూవీ చేస్తున్నాడు. దీని తరువాత మూవీని కూడా ఇపుడు విజయ్ లైన్లో పెట్టాడని అంటున్నారు.  'బ్రోచేవారెవరురా' ఫేం వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రం షూటింగ్ ఈ ఏడాది ద్వితీయార్థంలో సెట్స్ కి వెళుతుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

 

ఈ మూవీలో విజయ్ తన పాత పద్ధతిలో కనిపిస్తాడా లేక డిఫరెంట్ షేడ్స్ అంటూ కొత్త ప్రయోగాలు చేస్తాడా అన్నది ఇంకా తెలియలేదు. అయితే విజయ్ ఇపుడు ప్రయోగాలు చేసే పొజిషన్లో లేడని, తన ఇమేజ్ కి సరిపడ స్టోరీనే ఎంచుకున్నాడని అంటున్నారు.

 

సో విజయ్ నుంచి గీతాగోవిందం లాంటి మూవీయా, లేక రౌడీ ఇమేజ్ స్టోరీయా ఏదో ఒకటి మాత్రం ఆశించవచ్చు. ఏది ఏమైనా విజయ్ ఇపుడు క్రాస్ రోడ్లో ఉన్నాడు. అర్జంట్ గా హిట్లు కావాలి. మరి ఆత్రేయ ఆ లోటు తీరుస్తాడా. హిట్ పడుతుందా. వెయిట్ అండ్ సీ.

 

మరింత సమాచారం తెలుసుకోండి: