రోజు రోజు కి దేశంలో కరోనా విజృంభిస్తుంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా 2000 కుపైగా కరోనా కేసులు నమోదుయ్యాయి, వీటిలో 80 శాతం నిజాముద్దీన్ బాధితులే వున్నారు. ఇక సౌత్ లోనైతే  నిజాముద్దీన్ ఘటన కలకలం రేపుతుంది. ఢిల్లీ లోని నిజాముద్దీన్ లో ఇటీవల జరిగిన మత ప్రార్థనలకు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారితో పాటు తమిళనాడు వాసులు కూడా  చాలా మంది హాజరైయ్యారు దాంతో ఈ మూడు రాష్ట్రాల్లో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ ఒక్క రోజే తమిళనాడు లో 75కేసులు నమోదు కాగా ఆంధ్రప్రదేశ్ లో 24, కేరళ లో 21,కర్ణాటక లో 11 కేసులు నమోదయ్యాయి. తెలంగాణ లో ఈరోజు కరోనా కు సంబంధించిన హెల్త్ బులిటెన్ ఇంకా విడుదలకాలేదు. 
 
ఇదిలావుంటే కరోనా పై ఈ రోజు అన్నిరాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ జరిపారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఈ సమావేశంలో ప్రతి ఒక్క సీఎం తో మాట్లాడిన మోదీ కరోనా ను అరికట్టడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో వారిని అడిగి తెలుసుకున్నారు. అలాగే లాక్ డౌన్  విషయంలో కూడా చర్చ జరిగినట్లుగా సమాచారం. లాక్ డౌన్ ను ఒకే సారి  కాకుండా దశల వారిగా ఎత్తి వేయాలని ముఖ్య మంత్రులకు, మోడీ సూచించారట అందుకు తగ్గట్లు  ప్రణాళిక రూపొందించుకోవాలని మోదీ, ముఖ్యమంత్రలను కోరినట్లు తెలుస్తుంది. ఇక రేపు ఉదయం 9 గంటలకు కరోనా విషయంలో ఓ చిన్న వీడియో సందేశాన్ని ఇవ్వనున్నట్లు మోదీ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. దాంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: