టాలీవుడ్ లో సునీల్ కమెడియన్ గా తనకంటూ ఒక బెంచ్ మార్క్ ని క్రియోట్ చేసుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్  వంటి టాప్ స్టార్ హీరోల సినిమాలలో కమెడియన్ గా మంచి రోల్స్ పోషించి మోస్ట్ వాంటెడ్ కమెడియన్ గా పాపులర్ అయ్యాడు. చెప్పాలంటే స్టార్ హీరోలే తమ సినిమాలో సునీల్ ఉన్నాడా .. లేకపోతే అతని కోసం ఒక క్యారెక్టర్ రాయండి అంటూ ప్రత్యేకించి దర్శక రచయితలకి చెప్పేవారు. అంతగా క్రేజ్ ని సంపాదించుకున్నాడు సునీల్.

 

అయితే సునీల్ 'అందాల రాముడు' సినిమాతో హీరోగా మారాడు. ఈ సినిమా మంచి సక్సెస్ సాధించింది. ఆ తర్వాత రాజమౌళి తెరకెక్కించిన 'మర్యాదరామన్న'తో సూపర్ హిట్ అందుకున్నాడు. అంతేకాదు ఎప్పటికి రాజమౌళి తన కెరీర్ లో మీకు బాగా నచ్చిన సినిమా ఏది అంటే చెప్పే సమధానం 'మర్యాదరామన్న' సినిమా అనే. అందుకు కారణం ఈ సినిమాలో ఒక్క సీ.జి షాట్ లేకపోవడం. ఇక 'మర్యాదరామన్న' తర్వాత వరుసగా సినిమా ఛాన్సులు రావడంతో హీరోగా కంటిన్యూ అయ్యాడు. అయితే ఉన్నపలంగా సునీల్ నటిస్తున్న సినిమాలన్ని వరసగా బాక్సాఫీస్ వద్ద చతికిల పడ్డాయి. దాంతో సునీల్ కి హీరోగా ఉన్న క్రేజ్ మొత్తం పోయింది. నిర్మాతలు కూడా సునీల్ తో కమిటయిన సినిమాలని మిడిల్ డ్రాప్ చేసుకున్నారు. 

 

దీంతో మళ్లీ కామెడియన్ గా మారాడు. అయినా ముందున్న క్రేజ్ ని దక్కించుకోలేకపోతున్నాడు. అందుకు కారణం ఇప్పుడు బాగా ఫాం లో ఉన్న వెన్నెల కిషోర్, ప్రియదర్శి సత్య లాంటి కమెడియన్స్ తో పోటీ పడ లేకపోవడమే. దాంతో ఇప్పుడు విలన్ గా టర్న్ తీసుకున్నాడు. రవితేజ హీరోగా నటిించిన 'డిస్కోరాజా'లో సునీల్ విలన్ గా నటించాడు. కాని అది బాగా బెడిసి కొట్టింది. అంతేకాదు సునీల్ కి నెగిటివ్ కామెంట్స్ కూడా బాగా పడ్డాయి. అసలు సునీల్ విలన్ అంటే ఎవరూ నమ్మడం లేదు. అయినా సునీల్ మళ్ళీ 'కలర్ ఫోటో' అనే సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు. అయితే ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. 

 

అనవసరంగా ఉన్న ఇమేజ్ ని పోగొట్టుకొని గుండ్రని బంతిలా అన్ని రకాల క్యారెక్టర్స్ చేస్తూ సెటిలవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక సునీల్ బెస్ట్ ఫ్రెండ్ త్రివిక్రం ఎప్పుడో సునీల్ తో బంతి అన్న టైటిల్ తో సినిమా తీస్తానని మాటిచ్చాడు. మరి ఆ మాట ఎప్పుడు నిలబెట్టుకుంటాడో చూడాలి. లేదా సునీల్ కి ఇప్పుడున్న మార్కెట్ బట్టి రిస్క్ తీసుకోవడం ఎందుకని లైట్ తీసుకుంటారో చూడాలి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: